Watch Video: పెట్ లవర్స్‌కి మతిపోగొట్టే వీడియో.. ఈ బుజ్జి కూన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే, మాయలో పడినట్లే..

|

May 07, 2023 | 11:31 AM

పెంపుడు జంతువులుగా, మానవ జాతికి అత్యంత విశ్వాసకరమైన స్నేహితుడిగా ఇంట్లో ఆడుతూ తిరిగే కుక్కలు చాలా గమ్మత్తైనవి. ఎలాంటివారికైనా వారి టెన్షన్స్ నుంచి బయటపడేయగల శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. నమ్మడంలేదా..? అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్..

Watch Video: పెట్ లవర్స్‌కి మతిపోగొట్టే వీడియో.. ఈ బుజ్జి కూన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ చూశారంటే, మాయలో పడినట్లే..
Cute Expressions Of Doggy
Follow us on

పెంపుడు జంతువులుగా, మానవ జాతికి అత్యంత విశ్వాసకరమైన స్నేహితుడిగా ఇంట్లో ఆడుతూ తిరిగే కుక్కలు చాలా గమ్మత్తైనవి. ఎలాంటివారికైనా వారి టెన్షన్స్ నుంచి బయటపడేయగల శక్తిసామర్థ్యాలు వీటి సొంతం. నమ్మడంలేదా..? అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను మీరు చూడాల్సిందే. ఆ వీడియో చూస్తే మీకు టెన్షన్స్ పొవడమే కాదుగా, మతి పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది ఓ చిన్ని పెంపుడు కుక్క పిల్ల. అది ఇచ్చిన మంత్రముగ్ధమైన హావభావాలకు.. దాన్ని తమ సొంతం చేసుకోవాలని నెటిజన్లు  కోరుకుంటున్నారు.

అసలు ఈ వీడియోలో ఏం జరిగిందంటే.. ఓ చిన్ని కుక్క పిల్ల హెయిర్ కట్ కోసం సెలూన్‌లో ఉంది. అక్కడ ఉన్న బార్బర్ దానికి హెయిర్ కట్ చేస్తుంటే.. అది మాత్రం తన యాజమాని కెమెరాకు ముద్దు ముద్దుగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఉంది. ఆ కుక్క పిల్ల హావభావాలలో ఒక్కటే పోజ్ కానీ దాని నవ్వు, బయటకు అమాయకంగా వేలాడుతున్న నాలుక, మెరిసే కళ్లు నెటిజన్లను చూపు మరలచకుండా చేస్తున్నాయి. ఇక వీడియోను చూసిన నెటిజన్లు ఎంతో ఉత్సాహంగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

‘ఎంత క్యూట్‌గా ఉందో.. చూస్తే మాయ చేసేలా ఉంది’, ‘నాకు ఇచ్చేయండి ప్లీజ్.. చాలా క్యూట్‌గా ఉంది’, ‘ఇది నా దగ్గర ఉంటే చాలు, నా కంటే సంతోషకరమైన వ్యక్తి మరొకరు ఉండరు’, ‘ ఈ పప్పీ ఓనర్ అడ్రెస్ చెప్పండి.. నేను దాన్ని నా సొంతం చేసుకోవాలి. ఎన్ని డబ్బులైనా ఇస్తా’ అంటూ పలువురు నెటిజన్లు వారి వారి స్పందనలను తెలియజేస్తున్నారు. మరి కొందరైతే కుక్క పిల్లకు సంబంధించిన ఎమోజీలతో పాటు లవ్ ఎమోజీలు పెడుతున్నారు. ఇక ఈ వీడియోకు ఇప్పటివరకు 14 వేల లైకులు, 188 వేల వీక్షణలు అందాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..