Viral Video: ట్రిక్స్ ప్లే చేసే టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతను బోల్తా కొట్టించిన బుడ్డోడు.. నెక్ట్స్ లెవల్ అంతే..

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:10 PM

టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతలు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. వాళ్లు తిన్నగా ఐస్ క్రీమ్ కస్టమర్‌కు ఇవ్వరు. బదులుగా ఆటాడుకుంటారు. విసుగు తెప్పిస్తారు.

Viral Video: ట్రిక్స్ ప్లే చేసే టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతను బోల్తా కొట్టించిన బుడ్డోడు.. నెక్ట్స్ లెవల్ అంతే..
Turkish Ice Cream Seller
Follow us on

Trending Video: మీరు ఎప్పుడైనా టర్కిష్ ఐస్‌క్రీమ్ స్టాల్‌కు వెళ్లారా..? అక్కడ ఒక కోన్ ఐస్‌క్రీమ్ కొన్నారా? అయితే మీకు అక్కడ జరిగే సీన్ అంతా తెలిసే ఉంటుంది. ఒకవేళ వెళ్లకపోయినా.. సోషల్ మీడియా(Social media)లో అయినా చూసే ఉంటారు. ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి అంత సాధారణంగా దాన్ని మన చేతిలో పెట్టడు. అది మన చేతికి, నోటికి అందడానికి ముందు కొన్ని ట్విస్ట్‌లు, టర్న్‌లు, ట్రిక్స్ ప్లే చేస్తారు. గమ్మత్తైన ఆట తర్వాత చివరకు రుచికరమైన ఐస్ క్రీమ్ మన చేతికి వస్తుంది. అయితే ఓ బాలుడు టర్కిష్ ఐస్‌క్రీమ్ విక్రేతకు ఝలక్ ఇచ్చాడు. చిన్నోడిచ్చిన రివర్స్ పంచ్‌కు అతడి మైండ్ బ్లాంక్ అయ్యింది. నెటిజన్లు అయితే పిల్లోడు చేసిన పనికి ఫిదా అవుతున్నారు. వీడియోలో టర్కిష్ ఐస్‌క్రీం అమ్మేవారి స్టాల్ ముందు ఓ బాలుడు నిలబడి ఉన్నాడు. ఐస్ క్రీమ్ కొనేందుకు అక్కడికి వచ్చిన బాలుడ్ని విక్రేత బోల్తా కొట్టించడానికి ట్రై చేశాడు. కానీ బాలుడు అతని చేతిలోని.. స్టిక్‌ని లాగేసుకుని.. కోన్ ఐస్ క్రీమ్ తన చేతబట్టి.. తింటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్‌(Twitter)లో షేర్ చేశారు. నెటిజన్స్ ఈ క్లిప్‌ను బాగా లైక్ చేస్తున్నారు. రకరకాల కామెంట్స్‌తో హెరెత్తిస్తున్నారు.

వీడియో చూడండి: 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..