AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో..ఈ బుడ్డొడు మహా డేంజర్‌.. ప్రమాదకర పాములనే వణికిస్తున్నాడు..

కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పిలుస్తారు. కోబ్రా కాటు ప్రాణాంతకం కూడా. కానీ, ఒక చిన్న పిల్లవాడు ఈ అత్యంత విషపూరితమైన పామును పట్టుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బాలుడు పాము తోకను లాగుతూ అదేదో ఆట బొమ్మతో ఆడుకుంటున్నట్లుగా పట్టుకుంటున్నాడు.

Viral Video: వామ్మో..ఈ బుడ్డొడు మహా డేంజర్‌.. ప్రమాదకర పాములనే వణికిస్తున్నాడు..
Little Boy Catches Snake
Jyothi Gadda
|

Updated on: Aug 22, 2025 | 2:05 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివిధ రకాల వీడియోలను మనం తరచుగా చూస్తుంటాము. వీటిలో చిన్న పిల్లల వీడియోలు తుఫానులా వైరల్ అవుతాయి. కొన్నిసార్లు పిల్లలు విగ్రహాల కంటే కీర్తి గొప్పదని, బాహుబలం కంటే బుద్ధి బలం గొప్పదని మనం చెప్పాల్సిన పనులు చేస్తుంటారు. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొన్నిసార్లు మన సొంత సామర్థ్యాలు మనకు తెలియవు. దాని కోసం మనం ఒక నిర్దిష్ట అనుభవాన్ని, ఏదైనా ఒక సంఘటనను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు,మన నిజమైన బలాన్ని మనం గ్రహిస్తాము. అలాంటి ఒక చిన్నారి వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

చాలా మంది పామును చూసినప్పుడు ఏం చేస్తారు.. సాధారణంగానే భయంతో పరిగెడతారు. ఇక అలాంటి వాటిలో కింగ్ కోబ్రా ఎదురు పడితే ఇంకేమైనా ఉందా..? ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తాం. ఎందుకంటే కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటిగా పిలుస్తారు. కోబ్రా కాటు ప్రాణాంతకం కూడా. కానీ, ఒక చిన్న పిల్లవాడు ఈ అత్యంత విషపూరితమైన పామును పట్టుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బాలుడు పాము తోకను లాగుతూ అదేదో ఆట బొమ్మతో ఆడుకుంటున్నట్లుగా పట్టుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలో, మీరు ఈ బాలుడి వైపు దూసుకు వస్తున్న విషపూరిత పామును చూడవచ్చు. కానీ, ఈ బాలుడు అస్సలు భయపడడు. దీనికి విరుద్ధంగా చేతిలో ఉన్న కర్ర సహాయంతో, అతను పాము నోటిని నొక్కి, ఆపై దాని దవడను పట్టుకుని పైకి లేపాడు.. ఆశ్చర్యకరంగా అతని చేతిలో పాము లాంటి ప్రమాదకరమైన జీవి ఉన్నప్పుడు అతని ముఖంలో ఎలాంటి భయం లేదు. పైగా అతను వానపాము పట్టుకున్నంత సులభంగా పామును పట్టుకున్నాడు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది నెటిజన్లు చాలా భయపడ్డారు. ఆందోళనపడ్డారు. ఎందుకంటే ఈ పాము కాటు మనిషిని క్షణాల్లో చంపేస్తుంది. ఈ బాలుడి తల్లిదండ్రులు అతన్ని ఇంత విషపూరితమైన పాముతో ఆడుకోవడానికి ఎలా వెళ్లనిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొందరు అతని ధైర్యాన్ని ప్రశంసించారు. బహుశా ఈ పామును మచ్చిక చేసుకుని ఉండవచ్చు లేదా దాని విషం తొలగించబడి ఉండవచ్చు అంటూ మరికొందరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..