AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: భార్యంటే ఆ మాత్రం భయముండాలి.. మనోడు కారుపై వేసిన స్టిక్కర్ చూస్తే అవాక్

భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి. సరిగ్గా ఇదే నిదర్శనం ఈ వీడియో. ఓ వ్యక్తీ తన కారు నడుపుతూ హైవేపై వెళ్తుండగా.. అతడి కారు వెనుక ఓ స్టిక్కర్ ఉంది. అదేంటో చూస్తే అందరూ షాక్ అయ్యారు. ఓ సారి లుక్కేయండి.

Viral Video: భార్యంటే ఆ మాత్రం భయముండాలి.. మనోడు కారుపై వేసిన స్టిక్కర్ చూస్తే అవాక్
Trending
Ravi Kiran
|

Updated on: Aug 22, 2025 | 1:35 PM

Share

మనం చూస్తుంటాం.. చాలామంది తమ వాహనాల వెనుక రకరకాల సందేశాలు రాస్తుంటారు. చెడపకురా.. చెడేవు.. నన్ను చూసి ఏడవకురా అని కొందరు.. అమ్మ..నాన్న గిఫ్ట్‌.. ఇలా రకరకాల కొటేషన్స్‌ రాసుకుంటారు. ఆటోలు, కార్లు, లారీల వెనుక కనిపించే ఇలాంటి కొన్ని కొటేషన్స్‌ మనిషిని ఆలోచింపచేస్తాయి. అయితే ఓ వాహనదారుడు తన కారు వెనుక రాసిన కొటేషన్‌ చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అది భయమా, భక్తా.. లేక భయంతో కూడిన గౌరవమా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు మీద ఓ తెల్లని కారు వెళ్తోంది. దానిపైన ఓ ఆసక్తికరమైన కొటేషన్‌ రాసిఉంది. కారు వెనుక వెళ్తున్న వాహనదారులు ఎవరో దానిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ కారుపైన ఏమని రాసి ఉందంటే.. ‘ఇది నా భార్య కారు’ అని రాసి ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ కొటేషన్‌చూసి తెగ నవ్వుకుంటున్నారు. ఆ కారు అతడి భార్య గిఫ్ట్‌గా ఇచ్చిందేమో అని కొందరు, భార్య అంటే ఎంత భయమో.. అంటూ రకరకాలుగా చర్చింకుంటున్నారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘భార్య అంటే ఆ మాత్రం భయం ఉండాలి మరి’.. అంటూ కొందరు, ‘అలా రాయకపోతే చంపేస్తుందని భయపడ్డాడేమో’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 3 లక్షలమంది వీక్షించారు. 2 వేలమందికి పైగా లైక్‌ చేశారు.

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..