Shocking Video: వామ్మో.. టూరిస్టులకు షాకిచ్చిన మృగరాజు.. ఏకంగా వాహనం లోపలికి వెళ్లి.. వీడియో

Lion Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ప్రమాదకరంగా ఉంటాయి.

Shocking Video: వామ్మో.. టూరిస్టులకు షాకిచ్చిన మృగరాజు.. ఏకంగా వాహనం లోపలికి వెళ్లి.. వీడియో
Viral Video
Follow us

|

Updated on: Apr 24, 2022 | 12:13 PM

Lion Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ప్రమాదకరంగా ఉంటాయి. తాజాగా అడవిరాజు సింహానికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు కూడా భయపడతారు. సాధారణంగా అడవుల్లోనే కాకుండా జంతు ప్రదర్శనశాలల్లో మీరు సింహాలను చూసుంటారు. దీంతోపాటు కొంతమంది సింహాలను ఇళ్లల్లో కూడా పెంపుడు జంతువులుగా పెంచుకుంటారు. అయితే.. వాటికి సంబంధించిన సరదా సన్నివేశాలు ఎప్పుడూ కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా సోషల్ మీడియా (social media) లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో సింహం చేసిన పనికి అంతా షాకవుతున్నారు. ఓ సింహం డైరెక్ట్‌గా పర్యాటకులు ఉన్న వ్యాన్ లోకి ప్రవేశించి.. వారి మధ్య నుంచి బయటకు వచ్చింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. సఫారీలో ఓపెన్ టూరిస్ట్ వాహనంపై సింహం ఎక్కుతుంది. అంతా కూడా భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇది చూస్తే ఎవరికైనా చెమటలు ఇట్టే పట్టేస్తాయి. ఓపెన్ టూరిస్ట్ వాహనంలోకి ఎక్కిన తర్వాత.. సింహం దానిలో ఉన్న పర్యాటకుడిని ప్రేమతో కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి కూడా సింహం వీపును నిమురుతూ కనిపించాడు. అనంతరం సింహం వాహనం నుంచి కిందకు దిగి వెళుతుంది.

వైరల్ వీడియో..

ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో చూసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. అదే సమయంలో యూజర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకా నయం అడవి రాజు.. వేటాడకుండా సైలెంట్‌గా వెళ్లిపోయిందని.. ఇలాంటి వీడియోలు అరుదుగా చూస్తున్నామంటూ పేర్కొంటున్నారు.

Also Read:

Viral Video: అట్లుంటది మనతోని.. గూడు కోసం ఏకంగా జింకనే వాడేసిన కాకి.. వీడియో వైరల్

Viral Video: కదులుతున్న వాహనం నుండి దూకిన వ్యక్తి.. షాకింగ్, డేంజరస్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్