Viral Video : అడవికి రాజు సింహం. అది ఒక్కసారి గర్జిస్తే అడవి మొత్తం వణికిపోతుంది. కానీ అడవిలో చిరుతపులి కూడా ఉంటుంది. వేటలో దీనికి మించిన జంతువు లేదు. దీని కంటపడితే ఏ జంతువైనా సరే దానికి ఆహారం కావాల్సిందే. వేటలో చిరుత ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంటుంది. అందుకే దీనిని కనికరం లేని జంతువుగా పిలుస్తారు. ప్రస్తుతం చిరుతకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
వీడియోలో చిరుతపులి తన ఎర కోసం చెట్టుపై మాటు వేసి ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అడవి పంది వస్తుంది. ఎరను చూసిన చిరుత మెల్లగా పంజా విసరడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంటుంది. ఇంతలో చిరుత వాసన గమనించిన అడవి పంది దానిని చెట్టుపై ఉన్నట్లు గుర్తిస్తుంది. ఇంతలో చెట్టుపై నుంచి పంజావిసరడానికి సిద్దమవుతుండగా పంది అప్రమత్తమై అక్కడి నుంచి పరుగులగించుకుంటుంది. చిరుత నుంచి తప్పించుకుంటుంది. చిరుత చెట్టుపై నుంచి కిందికి వస్తుంది కానీ అప్పటికే అడవి పంది మైదానం గుండా పరుగుత్తుతూ కనిపిస్తుంది.
వీడియో చూసిన తరువాత చిరుతపులి చేతిలో నుంచి అడవిపంది ఎలా తప్పించుకుంది ఒక్కసారి ఆలోచించాలి. బలవంతమైన శత్రువు నుంచి తప్పించుకోవాలంటే మీ కళ్ళు, ముక్కు, చెవులు నిరంతరం పనిచేయాలి. లేదంటే బలి అవ్వక తప్పదు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో raze.baghahh అనే పేజీలో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియో 2 లక్షల 85 వేలకు పైగా వ్యూస్‌ని సంపాదించింది. దీనితో పాటు అడవి పంది ధైర్యాన్ని కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు.