Viral Video: వేట కోసం చిరుత సాహాసం మాములుగా లేదుగా.. గాల్లో పల్టీలు కొట్టి మరీ..

|

Jul 02, 2022 | 12:39 PM

తాజాగా ఓ చిరుత కోతి పిల్లను పట్టుకునేందుకు ఏకంగా గాల్లోనే పల్టీలు కొట్టింది. చివరకు అనుకున్నట్లుగానే

Viral Video: వేట కోసం చిరుత సాహాసం మాములుగా లేదుగా.. గాల్లో పల్టీలు కొట్టి మరీ..
Viral Video
Follow us on

చిరుత వేట ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన విషయమే. ఎరను పట్టుకునేందుకు ప్రమాదకరమైన సాహాసాలు చేస్తుంది. ఇటీవల సింహం, చిరుతల వేటకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ చిరుత కోతి పిల్లను పట్టుకునేందుకు ఏకంగా గాల్లోనే పల్టీలు కొట్టింది. చివరకు అనుకున్నట్లుగానే కోతి పిల్లను వేటాడింది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది.

మధ్యప్రదేశ్ లోని పన్నా టైగర్ రిజర్వ్ లో ఓ చిరుత కోతి పిల్లను వేటాడుతూ కనిపించింది. అందులో ఓ కోతి పిల్ల చెట్టు కొమ్మపై ఉండగా.. దాని పక్కనే ఉన్న మరో చెట్టుపైకి చిరుత ఎక్కిది. ఆ తర్వాత కోతిని పట్టుకోవడానికి తాను ఉన్న చెట్టు నుంచి మరో చెట్టుపైకి దూకి కోతి పిల్లను నోటిలో పట్టుకుంది. అయితే చెట్లుపై నుంచి దూకడంతో గాల్లోనే పల్టీలు కొట్టి కింద పడింది. అయినా కోతి పిల్లను మాత్రం వదిలిపెట్టకుండా చంపేసింది. ఈ వీడియోను @pannatigerreserve ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. చిరుత పులి వేటను చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.