Viral Photo: ‘జింక పిల్లను ముద్దు చేస్తున్న చిరుత’.. ఫోటో చూసి పొరబడకండి
జింకను చిరుత పులి వేటాడుతుంటే ఎంత ఉత్కంఠగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. జింకను ఛేజ్ చేసేందుకు చిరుత వాయు వేగంతో దూసుకెళ్తుంది. మాటు వేసి...

జింకను చిరుత పులి వేటాడుతుంటే ఎంత ఉత్కంఠగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. జింకను ఛేజ్ చేసేందుకు చిరుత వాయు వేగంతో దూసుకెళ్తుంది. మాటు వేసి తన జిత్తులను కూడా ప్రయోగిస్తుంది. అ చిరుత కంటికి చిక్కిన జింక పని ఖతమే..కానీ, ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. చిన్ని జింకపిల్లను ఓ చిరుత ముద్దు చేయడం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. చిరుతలు తమకంటే చిన్న జంతువులను వేటాడకుండా అస్సలు వదిలిపెట్టవు. అలిమి కుదిరితే పెద్ద జంతువులను సైతం ఖతం చేస్తాయి. అలాంటిది ఇక్కడ మాత్రం ఈ చిరుతపులి.. జింక పిల్లనుకౌగిలించుకున్న ఫోటోలు నెట్‌లో వైరల్‌గా మారాయి. జింక మెడపై చిరుత తన ముందరి కాలు వేసిన నిల్చున్న ఫోటో నిజంగా ఇది నిజమేనా అనిపిస్తోంది కదూ!. చిత్రాన్ని చూస్తే, చిరుతపులి, ఆ జింక స్నేహితులు అని మీరు అనుకుంటే, ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే.
వాస్తవానికి, చాలా సార్లు వేటాడే జంతువులు తమ ఆహారాన్ని చంపే ముందు అలాంటి స్నేహపూర్వక వైఖరిని అవలంబిస్తారు. అంతేకాదు ఆకలేసినప్పుడు చంపడానికి ఆ బుజ్జి జింకపిల్లను మచ్చిక చేసుకుని ఉండవచ్చు. వాస్తవానికి, ఈ ఫోటో 2019 సంవత్సరంలో జన బాహుళ్యంలోకి వచ్చింది. తాజాగా మరోసారి వైరల్ అవుతుంది. ఈ ఫోటోను దక్షిణాఫ్రికాలోని గ్రేటర్ కుర్గర్ నేషనల్ పార్క్‌లో రేనార్డ్ మూల్మాన్ క్లిక్ చేశారు. ప్రజలు ఈ ఫోటోను సోషల్ మీడియాలో తెగ సర్కుటేట్ చేస్తున్నారు. షేర్లు చేయడం మాత్రమే కాకుండా తమ స్పందనను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
What’s going on here? Come on y’all, I need a laugh. pic.twitter.com/Bdt6oCsVkm
— Jeffrey (@JeffreyMWard) June 22, 2021
