
ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో తరచూ జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియో గురించి మాట్లాడుకుందాం. ఇందులో ముళ్లపంది.. ఓ చిరుతను ఆటపట్టిస్తుంది. దానిని నోటికి కరుచుకుని కడుపు నింపుకుందాం అనుకున్న చిరుతకు చివరికి నిరాశే మిగిలింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి..
అడవిలో నియమాలు భిన్నంగా ఉంటాయి. ప్రతీ జంతువు వేగం, చాతుర్యం ఖచ్చితంగా ఉండాలి. క్రూర జంతువులకు ఆహారం కాకుండా అవే కాపాడుతుంటాయి. చిరుతపులి ఎంత ప్రమాదకరమైనదో మనందరికీ తెలుసు. అది వేటాడేటప్పుడు వేగాన్ని, వ్యూహాన్ని ఆచరణలో పెడుతుంది. అందుకే తనకు ఎరగా దొరికిన జంతువును ఎటూ పారిపోకుండా గట్టిగా పట్టుకోగలదు. అయితే కొన్నిసార్లు ఈ ‘డేంజరస్ వేటగాడు’ కూడా నిరాశతో వెనుదిరిగే సందర్భాలు కోకొల్లలు. అలాంటి వీడియోనే ఇది.
ఓ చిరుతను ముళ్లపంది ఆటపట్టించడం మీరు వీడియోలో చూడవచ్చు. అయితే ఆ క్రూర జంతువును చూసి పందికొక్కు ఏమాత్రం బెదరలేదు. తన ముళ్ళతో ధీటుగా ఎదుర్కుంది. ‘నీకు భయపడేది ఏంటి’ అంటూ దానిపైకి దూసుకుంటూ వెళ్ళింది. ఇంకేముంది చేసేది ఏమిలేక అక్కడ నుంచి చిరుత నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను ‘Wild Life_0.2’ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసింది. అది కాస్తా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘నిప్పుతో చెలగాటం అడుతున్నావ్ మావా’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. షేర్లు, లైకులతో హోరెత్తిస్తున్నారు.
Also Read:
ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు.. అన్ని జిల్లాల్లో ఒకేలా అమలు.. ఎప్పటినుంచంటే.!
10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!
కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!