Viral Video: పెళ్లి బంధంతో ఒక్కటైన ఇద్దరబ్బాయిలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, ఫొటోలు..

|

Jul 05, 2022 | 4:41 PM

కోల్‌క‌తా, గురుగ్రాంకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. హల్లీ వేడుక నుంచి రెసెప్షన్ వరకు వీరి వివాహం సందడి సందడిగా జరిగింది.

Viral Video: పెళ్లి బంధంతో ఒక్కటైన ఇద్దరబ్బాయిలు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో, ఫొటోలు..
Kolkata Gay Couple Wedding
Follow us on

Kolkata Gay Couple Viral Video: స్వలింగ సంప‌ర్కం అంటే నేరం చేసినట్టు కాదని వారి మ‌న‌సుల‌నూ పెద్దలూ అర్థం చేసుకుంటున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో ఇద్దరు గేలు కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్‌ సమ‌క్షంలో వివాహం చేసుకొని ఒక్కటైన విష‌యం తెలిసిందే. తాజాగా, కోల్‌క‌తా, గురుగ్రాంకు చెందిన ఇద్దరు స్వలింగ సంపర్కులు సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. హల్లీ వేడుక నుంచి రెసెప్షన్ వరకు వీరి వివాహం సందడి సందడిగా జరిగింది. ప్రస్తుతం స్వలింగ సంపర్కుల జంటకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అభిషేక్ రే ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ కాగా.. చైత‌న్య శ‌ర్మ గురుగ్రామ్‌లో డిజిట‌ల్ మార్కెటింగ్‌లో ప‌నిచేస్తున్నాడు. ఇద్దరు స్వలింగ సంపర్కులు. ఇరువురు.. కుటుంబ స‌భ్యుల‌ను ఒప్పించి జులై 3న ఘ‌నంగా పెళ్లిచేసుకున్నారు. అభిషేక్ రే సంప్రదాయ బెంగాలీ వరుడిలా ధోతీ కుర్తా ధరించగా, చైతన్య షేర్వాణీ ధరించాడు.

ఇవి కూడా చదవండి

సాంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరిద్దరి హల్దీ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

వీరి వివాహ వేడుకకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అభిషేక్ రే, చైతన్య శర్మ వివాహ వేడుకకు సంబంధించిన చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రేజీగా మారాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.