Viral Video: కింగ్‌ కోబ్రా, ముంగిస మధ్య భీకర పోరు..చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

King Cobra vs Mongoose: పాము (Snake), ముంగిస (Mongoose) బద్ధ శత్రువులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురుపడితే భీకర యుద్దమే జరుగుతుంది. వీటి మధ్య జరిగే ఫైట్ గురించి మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటాం

Viral Video: కింగ్‌ కోబ్రా, ముంగిస మధ్య భీకర పోరు..చివరకు ఎవరూ ఊహించని ట్విస్ట్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
King Cobra Vs Mongoose

Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2022 | 8:00 AM

King Cobra vs Mongoose: కొన్ని వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల పాములు, పులులు, మొసళ్లు, ఇలా జంతువుల వీడియోలు ఎక్కువగా ట్రెండింగ్‌ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు (Video) ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఇక పాము (Snake), ముంగిస (Mongoose) బద్ధ శత్రువులు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రెండు ఒకదానికి ఒకటి ఎదురుపడితే భీకర యుద్దమే జరుగుతుంది. వీటి మధ్య జరిగే ఫైట్ గురించి మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు వినే ఉంటాం. వీటి పోరును ఎక్కువగా పల్లెటూర్లలో చూసి ఉంటాం. చాలాసార్లు ముంగిసే విజయం సాధించినా.. అప్పుడప్పుడు కొన్ని పెద్ద పాములు కూడా ముంగిసపై పైచేయి సాధిస్తాయి. తాజాగా ఓ భారీ నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైట్ అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

africanwildlife1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్‌ అయిన ఈ వైరల్ వీడియోలో .. ‘ ఓ అడవిలో కింగ్ కోబ్రా, ముంగిస పరస్పరం తారసపడ్డాయి. వెంటనే రెండింటి మధ్య యుద్ధం ప్రారంభమవుతుంది. ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి. ఓసారి ముంగిసపై పాము దాడి చేస్తే.. ఇంకోసారి పాముపై ముంగిస దాడి చేసింది. ఓ సమయంలో పాము తలను ముంగిస పట్టుకోవడంతో అది విలవిల్లాడిపోతుంది. చివరికి ఎలాగోలా తప్పించుకుని ముంగిసపై మళ్లీ ఎదురుదాడికి దిగుతుంది. ముంగిసను చాలాసార్లు కాటేస్తుంది. అయినా కూడా వెనక్కి తగ్గదు ముంగిస. ఈ భీకర పోరులో పామును మట్టుపెట్టిన ముంగిస.. చివరకు అది కూడా ప్రాణాలొదులుతుంది. ఇదే ఇక్కడ ఎవరూ ఊహించని ట్విస్ట్. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్లో వైరల్‌గా మారింది. ‘సూపర్‌ ఫైట్.. రెండూ అసలు తగ్గడం లేదుగా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి మీరూ ఈ వైరల్‌ వీడియోపై ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..