Viral Video: జవాన్ దగ్గరకు వచ్చి పడగవిప్పిన రాచనాగు.. ఆ సైనికుడు చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే

|

Aug 19, 2022 | 5:49 PM

పాములను చూస్తే వెనక్కి తిరగకుండా పారిపోతాం.. కొంత మంది అయితే వెంటనే కర్రతో కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మనం దానికేదైనా హాని చేస్తామేమో అని అది కూడా మనపై దాడి చేస్తుంది.

Viral Video: జవాన్ దగ్గరకు వచ్చి పడగవిప్పిన రాచనాగు.. ఆ సైనికుడు చేసిన పనికి షాక్ అవ్వాల్సిందే
King Cobra
Follow us on

Viral Video: పాములను చూస్తే వెనక్కి తిరగకుండా పారిపోతాం.. కొంత మంది అయితే వెంటనే కర్రతో కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. మనం దానికేదైనా హాని చేస్తామేమో అని అది కూడా మనపై దాడి చేస్తుంది. నిజానికి దాని భయం, మన భయం ఒకటే.. అయితే కొంతమంది మాత్రం పాము ఎదురుపడితే చాలా చాకచక్యంగా దాన్ని పట్టుకొని అడవుల్లో వదిలేస్తుంటారు. అయితే ఎంత దైర్యవంతులైన సడన్ గా ఓ భారీ కోబ్రా ఎదురుగా వచ్చి పడగ విప్పితే భయపడకుండా ఉంటారా. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ సైనికుడి , ఓ భారీ కోబ్రాను మనం చూడొచ్చు..

ఈ వీడియోలో ఓ జవాన్ శత్రువులను మట్టుపెట్టడానికి అడవిలో దాక్కొని ఉన్నాడు. చేతిలో గన్ పట్టుకొని నెల పై పడుకొని శత్రువులను గమనిస్తున్నాడు. ఇంతలో అక్కడికి ఓ పెద్ద పాము వచ్చింది. అతని పక్కకు వచ్చి పడగ విప్పి బుసలు కొట్టింది. అది గమనించిన ఆ జవాన్ ఏమాత్రం బెదరకుండా చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా లోబరుచుకుని వెంటనే దాని నీటిభాగాని గట్టిగా పట్టుకున్నాడు. ఆ తర్వాత నేలపై పాకుకుంటూ వెళ్లి వేరే ప్రదేశంలో దానిని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సలాం సెల్యూట్ అంటున్నారు నెటిజన్లు. జవాన్ ధైర్య సాహసాలను సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి