సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన వీడియోలు రకరకాలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే.. మరికొన్ని భయాన్ని కలిగిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో చూసేద్దాం..
వైరల్ వీడియో ప్రకారం.. ఓ పాడుబడిన ఇంట్లోకి భారీ సైజ్ కింగ్ కోబ్రా ఒకటి దూరుతుంది. ఆ పామును చూసిన వెంటనే స్థానికులు ఒక్కసారిగా హడలిపోతారు. వెంటనే సమాచారాన్ని స్నేక్ క్యాచర్ కిరణ్‌కు అందిస్తారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఆ పామును చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అది కాస్తా అక్కడుంచి పారిపోతుంది. పాము తోకను పట్టుకుని ఎలాగైనా కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాడు స్నేక్ క్యాచర్. అయినా అది ఎక్కడా కూడా అతడికి చిక్కలేదు. ముప్పుతిప్పలు పెట్టింది.
అనంతరం స్టిక్‌తో పామును కదిలిస్తాడు. అంతే! ఒక్కసారిగా అది స్నేక్ క్యాచర్ కిరణ్ మీదకు బుసులు కొడుతూ కాటు వేసేందుకు వస్తుంది. అయినా కూడా వెనక్కి తగ్గని స్నేక్ క్యాచర్.. ఆ పామును బుజ్జగిస్తూ.. చివరికి తెలివిగా సంచిలో బంధిస్తాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో కొంచెం పాతదే అయినప్పటికీ.. మరోసారి మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..