Viral Video: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఇల్లు.. షాకింగ్ వీడియో వైరల్..

|

Oct 18, 2021 | 7:12 PM

Kerala rains: భారీ వర్షాలకు కేరళ చిగురుటాకులా వణుకుతోంది. వరదల భీభత్సంతో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా

Viral Video: అందరూ చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన ఇల్లు.. షాకింగ్ వీడియో వైరల్..
Kerala Rains
Follow us on

Kerala rains: భారీ వర్షాలకు కేరళ చిగురుటాకులా వణుకుతోంది. వరదల భీభత్సంతో ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిపడి ఇప్పటివరకు 26 మంది మరణించగా.. పలువురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగిపడిన చోట్ల సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో న‌ది పరివాహక ప్రాంతంలో వ‌ర‌ద ఉధృతివ‌ల్ల ఆదివారం సాయంత్రం కొట్టాయం జిల్లాలో.. ఓ ఇల్లు అమాంతం వ‌ర‌ద‌లో ప‌డి కొట్టుకుపోయింది. ఇల్లు న‌దిలో కొట్టుకుపోతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముందకాయం ప్రాంతంలోని మణిమాల నదికి వరద నీరు పోటెత్తడంతో.. నది ఒడ్డున ఉన్న ఇల్లు అందరూ చూస్తుండగానే నీటిలో కొట్టుకుపోయింది. అయితే ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్లయింది. ముప్పును ముందుగానే గుర్తించిన అధికారులు వరద ప్రభావిత ప్రాంతానున్న వారిని తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కేరళ వరదలకు సంబంధించి వైరల్ అవుతున్న ఈ భయానక వీడియోలను మీరు కూడా చూడండి..

వైరల్ వీడియో..

కాగా.. ఇల్లు నదిలో కొట్టుకుపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తనకు ఇల్లు కట్టేందుకు 27ఏళ్ల సమయం పట్టించదని ఇంటి యజమాని జెబిన్ తెలిపాడు. జెబిన్ ఒక ప్రైవేట్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో తాను డ్యూటీలో ఉన్నానని.. కుటుంబసభ్యులు చెబితే నమ్మలేదని వాపోయాడు. కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా 48 గంటలపాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కొట్టాయం జిల్లాలో 13 మంది మరణించగా.. ఇడుక్కి జిల్లాలో తొమ్మిది మంది, అలప్పుజ ప్రాంతంలో నలుగురు మరణించారు.

Also Read:

PM Narendra Modi: దేవభూమిలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి.. ప్రజలను అభినందించిన ప్రధాని మోదీ..

Lawyer Killed: యూపీలో దారుణం.. కోర్టులో న్యాయవాది హత్య.. తుపాకీతో కాల్పులు జరిపి..