అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క.. పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకుందని.. సదరు యజమాని ఆ మూడేళ్ళ నోరులేని జీవాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లి వీధిలో వదిలేశాడు. ఈ చిత్రమైన ఘటన కేరళలోని తిరువనంతపురం చకాయి వరల్డ్ మార్కెట్ పరిసరాల్లో చోటు చేసుకుంది. రోడ్డు మీద ఉన్న ఆ కుక్క మెడలో ఓ నోట్ కూడా ఉండడం విశేషం.
‘నిజానికి ఇది చాలా మంచి కుక్క. యజమానిని ఎటువంటి ఇబ్బంది పెట్టదు. ఎప్పుడూ కూడా అనారోగ్యానికి గురి కాలేదు. ప్రతి ఐదు రోజులకోసారి స్నానం చేస్తుంది. కేవలం పాలు, బిస్కెట్లు, కోడిగుడ్లు మాత్రమే తీసుకుంటుంది. మూడేళ్ల కాలంలో ఒక్కరిని కూడా కరవలేదు. కానీ ఇది కొద్దిరోజులుగా పక్కింటి కుక్కతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో దాని ప్రవర్తనలో మార్పు వచ్చింది. అందుకే ఈ పెంపుడు కుక్కను బయటకు పంపించానని’ సదరు యజమాని ఆ నోట్‌లో పేర్కొన్నాడు.
ఇక ఈ విషయం పీపుల్ ఫర్ ఏనిమల్ వాలంటరీ శామీన్‌కు తెలియడంతో అక్కడికి వచ్చి.. ఆ కుక్కను హోమ్‌కు తీసుకెళ్లారు. అనారోగ్యానికి గురైనప్పుడు కుక్కలను బయటకు వదిలేయడం చూశాం.. కానీ అక్రమ సంబంధం పేరిట కుక్కలను వదిలేయడం ఎప్పుడూ చూడలేదని శామీన్ తెలిపారు.
Thiruvananthapuram: A white Pomeranian dog was abandoned by its owner for having an “illicit relationship” with a dog next door. Shameem, People For Animals (PFA) volunteer says,”I was informed that a dog was found near Wall Market Gate, I went there & brought her home.” #Kerala pic.twitter.com/nvu6QXTVJ0
— ANI (@ANI) July 23, 2019