ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ, టిప్‌టాప్‌గా ఉన్న అతన్ని చూపి పెద్ద ఆఫీసర్ అనుకున్నారంతా. దీంతో కనీసం అడ్వాన్స్ కూడా తీసుకోకుండా సర్వభోగాలు అందించారు. కట్ చేస్తే.. బాగా ఎంజాయ్ చేసి బిల్లు కట్టకుండా ఉడాయించాడో పెద్దమనిషి. వెళ్తూ.. వెళ్తూ.. 100 మంది అతిధులకు భారీ స్థాయిలో పార్టీ ఇస్తానని, సర్వం సిద్ధం చేయించి మరీ కుచ్చుటోపీ పెట్టాడు. ఆనక.. విషయం తెలుసుకున్న హోటల్ యాజమన్యం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..
కేరళకు చెందిన తిరువనంతపురంలోని ఓ 5 స్టార్ హోటల్‌లో విసెంట్ జాన్ (65) అనే వ్యక్తి బస చేశాడు. అనర్గంలా ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ, హుందాగా ప్రవర్తిస్తూ చూపరులను ఆకట్టుకున్నాడు. దీంతో అతని వద్ద నుంచి రూం అడ్వాన్స్ తీసుకోకుండానే హోటల్‌లోకి అనుమతి ఇచ్చారు. స్వీట్స్ పంచిపెడుతూ.. తాను బయటికి వెళ్తున్నానని, తిరిగి వచ్చేటప్పటికి వంద మందికి భోజనం రెడీగా ఉంచాలని చెప్పాడట. ఎంతసేపటికీ తిరిగిరాకపోవడంతో అనుమానం కలిగిన హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్‌తోపాటు ల్యాప్‌టాప్ కూడా దొంగిలించినట్లు హోటల్ యాజమన్యం ఆరోపిస్తోంది. దీంతో రంగంలోకి దిగిన తిరువనంతపురం పోలీసులు విసెంట్ జాన్ మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసి, కేరళలోని కొల్లాం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం (డిసెంబర్ 25) అరెస్టు చేసి, స్థానిక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించినట్లు పోలీసులు తెలిపారు. హోటల్‌లో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. జాన్ కేరళలోనే కాకుండా గతంలో తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గోవాలలో కూడా చాలాసార్లు ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ఐతే ఇన్ని మోసాలకు పాల్పడ్డందుకు జాన్‌కు మూడు నెలలకు మించి శిక్ష విధించే అవకాశం లేదని కేరళ పోలీసులు అంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.