Optical Illusion: మీ కళ్లకు సవాల్.. ఈ ఫోటోలో చిరుత దాగుందో.. అదెక్కడుందో కనిపించిందా?

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే 'ఫోటో పజిల్స్'. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా..

Optical Illusion: మీ కళ్లకు సవాల్.. ఈ ఫోటోలో చిరుత దాగుందో.. అదెక్కడుందో కనిపించిందా?
Optical Illusion
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 26, 2022 | 6:13 PM

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే ‘ఫోటో పజిల్స్’. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఇవే దర్శనం ఇస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పజిల్స్‌పై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఓ మాంచి పజిల్ మనకు దొరికితే.. మన మైండ్‌కు కాసేపు పని దొరికినట్లే. ఇలాంటివి మన కళ్లకు పదునుపెట్టడమే కాదు.. మెదడుకు కూడా మేత వేస్తుంటాయి. తాజాగా ఓ ఫోటో పజిల్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని సాల్వ్ చేయలేక జనాలు బుర్రలు పట్టుకుంటున్నారు. మరి అదేంటో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? ఏదొక అటవీ ప్రాంతంలా కనిపిస్తోంది కదూ.. చుట్టూ నల్ల మట్టి ఉందిగా.. అయితే అక్కడే ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీకు కనిపించిందా.? ఆ మట్టి రంగులో అది ఇమిడిపోయి.. ఎంచక్కా సేద తీరుతోంది. దాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు తెగ కష్టపడుతున్నారు. మరి మీరూ ట్రై చేయండి. మొదటి అటెంప్ట్‌లోనే కనిపెట్టండి. మీ కళ్లు డేగ లాంటివైతే క్షణాల్లో కనిపెట్టేస్తారు. లేదంటే ఎంత వెతికినా దొరక్కపోతే సమాధానం కోసం కింద ట్వీట్ చూడండి..