కేరళకు చెందిన ఓ బైక్ ప్రియుడు తన ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి పాత మోటార్‌సైకిల్, కారు విడిభాగాలను ఉపయోగించాడు. ఇంట్లోని ప్రతి గదిని బైక్, కార్ల విడిభాగాలతో అలంకరించి తన సృజనాత్మకతను చాటుకున్నాడు. ఈ ప్రత్యేకమైన ఇంట్లోకి వెల్కమ్ చెప్పేందుకు.. ఇంటి ముందు పోస్ట్ బాక్స్‌లా యమహా RX100 బైక్ పెట్రోల్ ట్యాంక్‌తో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇక ఇంటి లోపలికి అడుగు పెట్టగానే, అంబాసిడర్ కారు సోఫా అవుట్‌డోర్ సిట్టింగ్ ఏరియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంటి కిటికీలు టైర్లతో ఫ్రేమ్ చేయబడ్డాయి. ఇంట్లోకి ప్రవేశించే ముందు, బజాజ్ చేతక్ హెడ్‌లైట్‌ను గోడపై డోర్ లైట్‌గా ఉపయోగించటం కనిపించింది. అందమైన ఇంట్లో అంతే అందంగా, ఖరీదైన ఇంటీరియర్ డిజైన్‌లు చేసి విలాసవంతమైన ఇళ్లను నిర్మించుకుంటారు చాలా మంది.
కేరళలో నిర్మించిన ఈ ఇల్లు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా చూపరులను కూడా బాగా ఆకట్టుకుంటోంది. కేరళలో నిర్మించిన ఈ ఇల్లు ప్రత్యేకంగా ఉండటమే కాకుండా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఈ ఇంటి మినీ హోమ్ టూర్ వీడియోను కంటెంట్ సృష్టికర్త ప్రియమ్ సరస్వత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
ప్రియంసరస్వత్ అనే X ఖాతాలో భాగస్వామ్యం చేయబడిన ఈ వీడియోకు 70.2 మిలియన్ల వ్యూస్, వేల సంఖ్యలో కామెంట్లు వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు స్పందిస్తూ..ఈ ఇల్లు చాలా అద్భుతంగా ఉంది అని కామెంట్ రాశారు. ఇంటీరియర్ డిజైనర్ల కంటే మీరు మీ ఇంటిని ఎంతో మెరుగ్గా డిజైన్ చేశారని మరో యూజర్ తెలిపారు. ఈ ప్రత్యేకమైన ఇంటిని చూసిన తర్వాత చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి