Wedding Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. అయితే.. వైరల్ అయ్యే వీడియోల్లో వివాహ వేడుకలకు సంబంధించినవి కూడా చాలానే ఉంటున్నాయి. పెళ్లి (Wedding) వేడుకల్లో జరిగే సరదా సన్నివేశాల వీడియోలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తుంటాయి. తాజాగా ఓ పెళ్లి కూతురు.. చకా చక్ అంటూ స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. సారా అలీ ఖాన్ అత్రంగి రే చిత్రంలోని ఈ పాటకు ఆమె వేసిన స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ (Viral Video) అవుతోంది. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఓ వధువు.. తన పెళ్లి రోజున ఈ పాటకు చేసిన డ్యాన్స్.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
వధువు రెంజితా ఆర్ నాయర్ తన వివాహ వేడుకలో చేసిన డ్యాన్స్ ను వీడియోలో చూడవచ్చు. ఆమె పక్కన ఉన్న మరికొందరితో కలిసి ఆమె చకా చక్‌కి స్టెప్పులేసినప్పుడు.. దీనిని అక్కడున్న వారు చిత్రీకరించారు. వధువు డ్యాన్స్ చేస్తూ.. పాటకు అనుగుణంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. అయితే.. ఆమె డ్యాన్స్ వేస్తున్నప్పుడు.. వరుడు పక్కనే ఉంటాడు.. వధువును చూసి నవ్వుతూ కనిపిస్తాడు. కానీ డ్యాన్స్ వేయడు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియో చూడండి..
వీడియో..
ఈ వైరల్ వీడియోను ఫోటోగ్రాఫర్ జెరీ జాకబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిబ్రవరి 11న షేర్ చేశారు. అప్పటి నుండి ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటివరకు 4.1 మిలియన్లకు పైగా వీక్షించారు. అంతేకాకుండా వధువును అభినందిస్తూ.. కామెంట్లు చేస్తున్నారు.
Also Read: TS Govt Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10 వేల పోస్టుల భర్తీ..
వేప, రావి చెట్లకు అంగరంగ వైభవంగా వివాహం.. ఆపై విందు భోజనం.. ఎక్కడంటే..