Snake Viral Video: పాములకు గుండెపోటు వస్తుందా..? అందరూ చూస్తుండగా క్షణాల్లో చనిపోయిన పాము..

| Edited By: Janardhan Veluru

Jul 29, 2024 | 1:22 PM

వైరల్ అయిన వీడియోలో ఒక నాగుపాము నేలపై పడి ఎంతో వేదనతో మెలికలు తిరుగుతోంది. పాముకు గుండెపోటు వస్తేనే ఇలాంటి బాధ కలుగుతుందని అక్కడున్న వారు చెబుతున్నారు. చాలా మంది వినియోగదారులు పాము గుండెపోటుకు సంబంధించిన యువకుడి వాదనను ప్రశ్నించారు? ఇది సాధ్యం కాదని చెబుతున్నారు.

Snake Viral Video: పాములకు గుండెపోటు వస్తుందా..? అందరూ చూస్తుండగా క్షణాల్లో చనిపోయిన పాము..
Snake Video Viral
Follow us on

మారుతున్న జీవనశైలి, ఒత్తిడి, ఆహారపు అలవాట్ల వల్ల రోజు రోజుకీ గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గుండెపోటుకు బలి అవుతున్న వారి సంఖ్య గత కొంతకాలంగా పెరుగుతోంది. అయితే జంతువులు కూడా గుండె పోటు బారిన పడతాయా అని ఇప్పటి వరకూ ఎవరూ ఆలోచించలేదు. అయితే క్షణాల్లో చనిపోయిన పాముకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాముకు గుండెపోటు వచ్చిందని చెబుతున్నారు. అయితే పాముకు గుండెపోటు వస్తుందా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

కర్ణాటకలోని హావేరి నగరం ఉంది. ఇక్కడ ఒక స్నాక్ ప్రేమికుడు తన ఇన్‌స్టా ఖాతాలో పాముకి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. నాగుపాము గుండెపోటుతో చనిపోయిందని వీడియోతో పాటు క్యాప్షన్ జత చేశాడు. వైరల్ అయిన వీడియోలో ఒక నాగుపాము నేలపై పడి ఎంతో వేదనతో మెలికలు తిరుగుతోంది. పాముకు గుండెపోటు వస్తేనే ఇలాంటి బాధ కలుగుతుందని అక్కడున్న వారు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

జూలై 10న ఆ యువకుడు ఈ వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. ఈ వీడియోను 4.5 మిలియన్ (45లక్షల మంది) కంటే ఎక్కువ సార్లు వీక్షించారు. చాలా మంది షేర్ కూడా చేశారు. చాలా మంది వినియోగదారులు పాము గుండెపోటుకు సంబంధించిన యువకుడి వాదనను ప్రశ్నించారు? ఇది సాధ్యం కాదని చెబుతున్నారు. పాము వాహనం ఢీకొని ఉండవచ్చని ఓ వినియోగదారు కామెంట్ చేయగా.. పాము అంతర్గత గాయాలతో బాధపడి ఉండొచ్చు అని చెప్పారు.

పశువైద్యులు ఏమి చెబుతున్నారంటే?

పాములు సరీసృపాల వర్గానికి చెందిన జీవులని వెటర్నరీ డాక్టర్ మనోజ్ చెప్పారు. కనుక పాములకు హృదయం కూడా ఉంటుంది. దీంతో ఇవి కూడా గుండె జబ్బులతో బాధపడవచ్చు. ఇది గుండె వైఫల్యానికి సంబంధించిన సందర్భం కావచ్చు. కొన్ని పరిస్థితులలో గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. అప్పుడు జీవి చనిపోతుంది. ఇలా జారగడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు జీవికి ఇప్పటికే ఏదైనా వ్యాధి ఉన్నా… జీవికి సంబంధించిన గుండె సరిగ్గా అభివృద్ధి చెందకపోయినా గుండె పోటు బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..