
పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. చెప్పాలంటే ఇదే ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అందమైన లొకేషన్స్‌లో కాబోయే జంట ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ పేరుతో సన్నిహితంగా ఫొటోలు దిగుతున్నారు. ఎన్నో థీమ్స్, స్టైల్స్‌తో నూతన వధూవరులను ఫొటోలు తీసేందుకు ఫొటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఆ క్రమంలో అనేక వింతైన రీతిలో కొందరు, కొన్ని ఫన్నీ ఘటనలతో మరికొందరి ఫోటోషూట్ వేడుకలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే ఓ ఆసక్తికరమైన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
కర్ణాటక రాష్ట్రం యాద్గిర్ జిల్లాకు చెందిన ఓ జంట ప్రీవెడ్డింగ్ షూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. వాడ్గేరా తాలూకాలోని కుమ్నూర్ గ్రామానికి చెందిన కుపేంద్ర, వాడ్గేరా పట్టణానికి చెందిన శ్రీదేవిల ప్రీ-వెడ్డింగ్ షూట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ జంట ఫోటోషూట్ పూర్తిగా దేశీ శైలిలో జరిగింది. ఇందులో వారు ఆధునిక దుస్తులకు బదులుగా సాంప్రదాయ దుస్తులను ధరించారు. కుపేంద్ర తలపై పంచ, టవల్ ధరించి గొర్రెల కాపరిలా కనిపించాడు. శ్రీదేవి ఇల్కాల్ చీర కట్టుకుని, చేతిలో కర్ర పట్టుకుని గొర్రెలు, మేకలను మేపుతున్న స్థానిక అమ్మాయిలా కనిపిస్తుంది.. ఈ షూట్ పూర్తి గ్రామీణ నేపథ్యంలో సాంప్రదాయ జీవనశైలిని చూపిస్తుంది.
ఈ ప్రీ-వెడ్డింగ్ షూట్ నవ యుగ ప్రేమకు కొత్త చిహ్నంగా నిలుస్తుంది. సాంప్రదాయ విలువలను ఆధునికతతో మేళవించిన ఈ జంట ఫోటోషూట్ యాద్గిర్ గ్రామాలకే కాకుండా ఇతర గ్రామాలకు కూడా ప్రేరణనిస్తుంది. వివాహబంధంతో ఒక్కటవుతున్న కుపేంద్ర, శ్రీదేవి, వారి ప్రీ-వెడ్డింగ్ షూట్ ద్వారా దేశీ సంస్కృతి అందాన్ని ప్రపంచానికి మరోమారు కొత్తగా పరిచయం చేశారు.
మొత్తంమీద, ఈ కొత్త తరహా ప్రీ-వెడ్డింగ్ షూట్ మన దేశ సంప్రదాయం, ఆధునికత మిశ్రమాన్ని ప్రదర్శిస్తుంది. యాద్గిర్ నుండి కుపేంద్ర, శ్రీదేవిల ఈ షూట్ గ్రామాల్లో పెరుగుతున్న ఈ ప్రీవెడ్డింగ్ ఫోటో షూట్ సంస్కృతికి ఒక ఉదాహరణ. రాబోయే పెళ్లిళ్ల సీజన్లో ఇది మరింత ప్రజాదరణ పొందుతుందని పలు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..