వెర్రి వెయ్యి రకాలు అంటారు.. ఇప్పుడు కొందరు యువకులు చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. సరదాగా కోసం చేసే స్టంట్స్ ప్రాణాల మీదకు తెస్తుంటాయి.. ఇటీవల రీల్స్ కోసం ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లడం.. అక్కడ స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలు చూసే ఉంటాము.. తాజాగా ఓ యువకుడు చేసిన పని అతని ప్రాణాల మీదకు తెచ్చింది. స్థానికులు హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండా చేసిన పనితో ఇప్పుడు ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.. ఈ ఘటన కర్ణాటకలోని చిక్మబళ్లాపూరలోని శ్రీనివాస్ సాగర్ డ్యామ్ దగ్గర జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కర్ణాటకలోని చిక్మబళ్లాపూరలోని శ్రీనివాస్ సాగర్ డ్యామ్ వద్దకు భారీగా వరద నీరు చేరడంతో ఆనకట్ట పై నుంచి నీళ్లు కిందకు వస్తున్నాయి.. ఈ ఆహ్లాదకరమైన దృశ్యాన్ని చూసేందుకు అక్కడకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలోనే డ్యామ్ చూడటానికి స్నేహితులతో కలిసి వచ్చిన ఓ యువకుడు సరదాగా డ్యామ్ పైకీ ఎక్కాలనుకున్నాడు. ఆ ఆనకట్ట ఎత్తు దాదాపు 50 అడుగులు ఉండగా.. ఆ యువకుడు 30 అడుగుల వరకు ఎక్కాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ తప్పడంతో ఒక్కసారిగా అక్కడి నుంచి కింద పడ్డాడు.. దీంతో వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. డ్యామ్ దగ్గర ప్రమాదకర ఫీట్ చేయొద్దని పోలీసులు హెచ్చరించిన సదరు యువకుడు పట్టించుకోకపోవడంతో అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
A man fell down the wall of Srinivasa Sagara Dam in #Chikkaballapur and got injured while he was attempting to scale the wall. Reports @dpkBopanna pic.twitter.com/KUpU1NRgyR
— Sanjay Jha (@JhaSanjay07) May 23, 2022