
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. తనను లైంగికంగా వేధించి.. బలవంతంగా ముద్దు పెట్టుకున్న మాజీ ప్రియుడి నాలుకను కోరికేసింది. ఆ వ్యక్తిని కాన్పూర్ నివాసిగా గుర్తించారు పోలీసులు. ముప్పై ఐదు సంవత్సరాల సదరు వ్యక్తికి అప్పటికే వివాహం అయింది. బాధిత మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు సదరు మహిళకు వేరొకరితో వివాహం నిశ్చయించగా.. అతడిని కలవడం ఆపేసింది. దీంతో తనను కలవాలని ఆమెపై ఒత్తిడి తెచ్చిన అతడు.. సోమవారం మధ్యాహ్నం ఆ మహిళ చెరువు వద్దకు వచ్చినప్పుడు.. ఆమెను లైంగికంగా వేధించడమే కాదు.. బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. దీంతో తనను తాను రక్షించుకునేందుకు సదరు వ్యక్తి నాలుకను కొరికి పారిపోయింది.
దీంతో సదరు వ్యక్తికి తీవ్ర రక్తస్రావం అయ్యి.. నొప్పితో కేకలు వేయగా.. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు అతన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(CHC)కి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స తర్వాత, వైద్యులు ఆ వ్యక్తిని కాన్పూర్‌లోని హాలెట్ ఆసుపత్రికి తరలించారు.
परेशान युवती ने युवक की काटी जीभ, घायल
युवक के युवती से थे प्रेम संबंध
युवती की शादी तय होने से परेशान था युवक
पुलिस ने मुकदमा दर्ज कर शुरू की जांच
बिल्हौर थाना क्षेत्र के एक गांव का मामला@kanpurnagarpol #kanpur #CrimeNews #abcnewsmedia pic.twitter.com/WggyIh0hPG
— Abcnews.media (@abcnewsmedia) November 18, 2025