Viral Video: జూలో బుల్లి ఎలుగు బంటి అల్లరి చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. పిల్ల సూపర్ స్టార్ అంటూ లైకులు, షేర్లు..

జూలో జుంజున్ అనే బేబీ ఎలుగుబండి అందరికి ఇష్టమైనదిగా మారింది.. ఏడాది వయసున్న ఈ చిన్న ఎలుగుబంటి ప్రేక్షకులందరి హృదయాలను దోచేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దాదాపు 1 మీటరు పొడవు, 35 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న జుంజున్ ఒక అందమైన కుక్కపిల్లలా కనిపిస్తుంది. దాని క్యూట్ లుక్స్, అమాయక చర్యలు అందరికి ఇష్టమైనవిగా మారుతున్నాయి. కేవలం ఫోటోలు, వీడియోలు తీసేందుకే చాలా మంది జూకు వస్తుంటారు.

Viral Video: జూలో బుల్లి ఎలుగు బంటి అల్లరి చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. పిల్ల సూపర్ స్టార్ అంటూ లైకులు, షేర్లు..
Junjun The Viral Bear Cub

Updated on: Jan 17, 2025 | 11:41 AM

జూకి వెళితే..అక్కడ ఎన్నో రకాల జంతువులను చూడొచ్చు. అలాగే, జంగిల్‌ సఫారిలో ఆ జంతువుల్ని మరింత దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడో జూలో ఏడాది వయసున్న ఓ బుల్లి ఎలుగుబంటి జుంజున్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇంటర్‌నెట్‌ వేదికగా నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. జుంజున్‌కి తన ఇష్టమైన బొమ్మ ‘పాత టైర్’తో ఆడుకోవడం, నీటిలో సరదాగా గడపడం చాలా ఇష్టం. అంతేకాదు..జూకి వచ్చే చాలా మంది సందర్శకులకు ఇది ఇష్టమైనదిగా మారింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. వీడియో చూసిన ఎక్కువ మంది లైకులు, షేర్లు చేస్తున్నారు.

చైనాలోని షాంఘై జూలో జుంజున్ అనే బేబీ ఎలుగుబండి అందరికి ఇష్టమైనదిగా మారింది.. ఏడాది వయసున్న ఈ చిన్న ఎలుగుబంటి ప్రేక్షకులందరి హృదయాలను దోచేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దాదాపు 1 మీటరు పొడవు, 35 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువున్న జుంజున్ ఒక అందమైన కుక్కపిల్లలా కనిపిస్తుంది. దాని క్యూట్ లుక్స్, అమాయక చర్యలు అందరికి ఇష్టమైనవిగా మారుతున్నాయి. కేవలం ఫోటోలు, వీడియోలు తీసేందుకే చాలా మంది జూకు వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ బ్రౌన్ ఎలుగుబంటిని చూసిన వారు ఖచ్చితంగా దానిని కుక్క పిల్లా అనే భావిస్తారు. సాధారణంగా జనవరి చలిలో జూకి చాలా తక్కువ మంది వస్తుంటారు. కానీ, జుంజున్ తన ఎంపిక చేసిన సందర్శకులను అలరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. దాంతో ఈ ఎలుగుబంటి పిల్ల ఇప్పుడు జూలో స్టార్‌గా మారింది.

వీడియో ఇక్కడ చూడండి..

జుంజున్ దాని తల్లిదండ్రులకు మొదటి సంతానం. కానీ, అతన్ని జూ సిబ్బంది పెంచారు. వారు దానికి బొమ్మలు, ఇష్టమైన ఆహారం, ఆపిల్, తేనె ఇస్తారు. ఈ బేబీ ఎలుగుబంటిని చూసేందుకు అందరూ ఇష్టపడుతుంటారని జూ ఉద్యోగి ఒకరు చెప్పారు. గంటల తరబడి ప్రేక్షకుల ముందు ఆడుతూనే ఉంటుందని, జుంజున్ ఇప్పుడు జూ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా స్టార్ అయిపోయిందని వివరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..