
జపాన్ సైన్స్ కంపెనీకి చెందిన ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అరుదైన యంత్రాన్ని రూపొందించారు. ఇది మానవులు ప్రతిరోజూ ఉపయోగించగల సాధనం. ఎందుకంటే ఈ ప్రత్యేక యంత్రం మీ మురికి దుస్తులను శుభ్రం చేసినట్లుగా మానవ శరీరాన్ని శుభ్రపరుస్తుంది. ఈ యంత్రం ప్రత్యేకత ఏంటంటే..
ఒక వ్యక్తి ఈ యంత్రం ఫైటర్ జెట్ కాక్‌పిట్ ఆకారంలో ఉన్న ప్లాస్టిక్ పాడ్‌లోకి ప్రవేశించినప్పుడు, అది వెంటనే వెచ్చని నీటితో నింపుతుంది. లోపల ఉన్న హై-స్పీడ్ జెట్‌లు మీ శరీరంపై వేగంగా నీటిని స్ప్రే చేస్తాయి. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, మూడు మైక్రోమీటర్-పరిమాణ ఫోమ్ బుడగలు తయారవుతాయి. ఇవి ఒత్తిడిని సృష్టిస్తాయి. మానవ శరీరం నుండి మురికిని పూర్తిగా తొలగిస్తాయి. ఈ పాడ్ స్నానం చేయించడమే కాదు, వినోదం కోసం ఒక వ్యవస్థను కూడా కలిగి ఉంది. ఇందులో స్నానం చేస్తున్నప్పుడు సంగీతం వినడానికి కూడా సౌకర్యాన్ని అందిస్తుంది. అందువలన, ఇది హైటెక్ స్నాన అనుభవాన్ని అందిస్తుంది.
ఆశ్చర్యకరంగా నేటి ఇంజనీర్లు ఈ మానవ వాషింగ్ మెషీన్‌ను కొత్త ఆవిష్కరణగా ప్రదర్శించినప్పటికీ, దాని అసలు ఆలోచన 50 సంవత్సరాల క్రితం ఉద్భవించింది. ఈ యంత్రాన్ని మొదట 1970లో జపాన్‌లోని సాన్యో ఎలక్ట్రిక్ (ఇప్పుడు పానాసోనిక్) తయారు చేసింది. కానీ ఆ వెర్షన్‌తో పోలిస్తే నేటి టెక్నాలజీకి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. మరింత సౌకర్యవంతంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..