
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిత్ర విచిత్రమైన విశేషాలన్నింటి గురించి మనం క్షణాల్లో తెలుసుకుంటున్నాం. ఇక ఈ కోవకు చెందిన ఓ వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదొక రైల్వే స్టేషన్ 42 ఏళ్లుగా ఒక్క ట్రైన్ కూడా ఆగలేదు. అక్కడ రాత్రి అయితే చాలు ఇక అంతే.! అసలు ఆ రైల్వే స్టేషన్ ఎక్కడుంది.. దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దెయ్యం ఉందో లేదో తెలియదు గానీ దాని పేరు వినగానే మాత్రం చాలా మంది గజగజలాడిపోతుంటారు. కొంతమందికి దెయ్యం కథలంటే ఇష్టం. అయినప్పటికీ దెయ్యాలతో ముఖాముఖీ మాత్రం ఎవ్వరికీ నచ్చదు. కానీ, పశ్చిమ బెంగాల్‌లో దెయ్యాలకు ఆవాసంగా ఓ రైల్వేస్టేషన్ ఉంది. ఈ రైల్వేస్టేషన్లో దెయ్యాలు తిష్ఠ వేశాయని స్థానికులు నమ్ముతారు. అందుకే అక్కడ రాత్రి అయ్యిందంటే చాలు.. ఒక్క మనిషి కూడా ఉండడు. అసలు ఈ రైల్వే స్టేషన్‌కు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా?
పశ్చిమ బెంగాల్‌లోని పురిలియా జిల్లాలో గల ఈ చిన్న రైల్వే స్టేషన్ పేరు బేగున్ కోదర్. ఇది కలకత్తా నగరానికి 260 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.. దీని ఫ్లాట్‌ఫామ్ మీదికి ప్రయాణీకులు రారు. అక్కడ దిగి ప్రయాణీకులు ఎక్కడికీ పోరు. చచ్చేటంత భయం! ఆ వూళ్ళో కూడా ఆ రైలు స్టేషన్ పేరు చెబితే హడల్. ఎందుకంటే ఆ ప్లాట్‌ఫామ్‌మీద ఒక ఆడ దెయ్యం తెల్లని దుస్తులు ధరించి అర్థరాత్రివేళ సంచరిస్తూ, రైలు పట్టాలమీద తిరుగుతుండటం చాలామంది చూశారు. ఆ స్టేషన్‌లో పనిచెయ్యమంటే చాలు, ఆగకుండా పరిగెడతారు సిబ్బంది. దెయ్యం పీక్కుతుంటుందనే భయం. ఉద్యోగం పోతే ముష్టి ఎత్తుకుంటాం అంటారు.
చివరకు 2007లో అప్పటి రైల్వేశాఖమంత్రి మమతా బెనర్జీ ఈ రైల్వేస్టేషన్ రీ ఓపెన్ చేయించారు. అయితే ఇప్పటికే అక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం వణికిపోతూ ఉంటారు. ప్రతిరోజు ఉదయం పూజాకార్యక్రమాలు ముగిశాకే స్టేషన్లోకి వస్తారు. అయితే రైల్వేస్టేషన్ గోడలపై ఇప్పుడు మొత్తం దేవుళ్ల చిత్రపటాలను పెయింటింగ్లను ఉంచారు.
ఇటీవల కొందరు యువకులు స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఓ రాత్రంతా ఆ రైల్వేస్టేషన్లో గడిపారు. వాళ్లు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటించి ఆ రైల్వే స్టేషన్లో ఎటువంటి దెయ్యాలు లేవని.. మేము రాత్రంతా అక్కడ గడిపామని ప్రచారం చేశారు. అయినప్పటికీ ప్రజలు మాత్రం అక్కడ దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారు. దెయ్యాల రైల్వేస్టేషన్‌గా దానికి పేరు పడిపోయింది.
Also Read:
అడవి దున్నను చుట్టుముట్టిన సింహాలు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్.. చూస్తే ఆశ్చర్యపోతారు!
ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!
ఎలుకను వేటాడాలనుకున్నా పాము.. తీరా చూస్తే సీన్ రివర్స్.. చూస్తే నోరెళ్లబెడతారు!