
ఐర్లాండ్‌లోని సిటీలింక్ బస్సులో ఒక వింత సంఘటన జరిగింది. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న ఒక పెద్ద సూట్‌కేస్ నుండి సడెన్‌గా ఏవో శబ్ధాలు రావటం సిబ్బంది గ్రహించారు. వారు వెంటనే అధికారులకు ఫోన్ చేసి సూట్‌కేస్ తెరవడానికి అనుమతి పొందారు. సూట్‌కేస్ తెరిచి చూడగా లోపల ఒక మహిళ సజీవంగా కనిపించింది. పొరపాటున దొరికిపోయానే అన్న భయం ఆమెలో కనిపించింది. ఆ మహిళ తనను తాను అక్రమంగా బయటకు తీసుకురావడానికి సూట్‌కేస్‌లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. గాల్వేకు వెళ్తున్న బస్సులో ఈ వింత సంఘటన జరిగింది. కాగా, ఇదంతా ఏవరో వీడియో తీశారు.
బస్సులో ఉన్నసూట్‌కేస్ నుండి వింతగా శబ్ధాలు రావడంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. లగేజ్ కంపార్ట్‌మెంట్‌లో నుండి సూట్‌కేస్ బయట పడేయగా, లోపలి నుండి అరుపులు వినిపించాయి. దాంతో వెంటనే వారు అధికారుల అనుమతితో సూట్‌కేస్ ఓపెన్ చేశాడు. అందులోంచి ఒక మహిళ భయంతో బయటకు వచ్చింది. ఎదురుగా ఉన్న సిబ్బందిలో ఒకరు ఆమెను ప్రశ్నించారు. నువ్వు ఈ సూట్‌కేస్ లోపలికి ఎలా వెళ్లావు అని అడిగారు. అందుకు ఆమె ఎలాంటి సమాధానం చెప్పకుండా థ్యాంక్ గాడ్ .. థ్యాంక్‌గాడ్ అంటూ నేలపై కూర్చుని తల పట్టుకుంది. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ మహిళ అనధికార ప్రయాణీకురాలిగా పోలీసులు వెల్లడించారు. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నామని సిటీలింక్ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఆ మహిళ తనను తాను అక్రమంగా రవాణా చేసుకోవడానికి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఆమె తనను తాను సూట్‌కేస్‌లో బంధించి ఉంచుకుని బస్సులో ప్రయాణించాలని భావించింది. అదృష్టవశాత్తూ, ఆమె సురక్షితంగా తప్పించుకుంది. లేదంటే, ఊపిరాడక ప్రాణాలు పోయేవి. సిబ్బంది అప్రమత్తత వల్ల పెద్ద విషాదం తప్పింది. ఈ సంఘటన ప్రజలకు ఒక పాఠంగా ఉపయోగపడుతుంది. ప్రయాణించేటప్పుడు భద్రతా నియమాలను పాటించడం ముఖ్యం. అనుమతి లేకుండా ప్రయాణించడం ప్రమాదకరం కావచ్చు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..