Internet sensation Kili Paul: టాంజానియాకు చెందిన ఇంటర్నెట్ సెన్సెషన్ కిలీ పాల్‌ను ఆ దేశంలోని భారత హైకమిషన్ (High Commission of India) సత్కరించింది. టాంజానియాలోని హైకమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన కిలీ పాల్‌తో భారత దౌత్యవేత్త బినయ ప్రధాన్ కొన్ని చిత్రాలను పంచుకున్నారు. కిలీ పాల్ టిక్ టాక్ వీడియోల నుంచి వైరల్ అయ్యారు. ఆ తర్వాత ఇన్‌స్టా, తదితర సోషల్ మీడియా సైట్లల్లో ఆయన ఫాలోవర్లు రెండు మిలియన్లకు పైగా ఉన్నారు. కిలీ పాల్, అతని సోదరి నీమా పాల్ తరచుగా ప్రముఖ బాలీవుడ్ (Bollywood), టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ చేయడంతోపాటు.. డ్యాన్స్ చేసి వీడియోలను షేర్ చేస్తారు. ఈ అన్నాచెల్లెలు ఇలా చేస్తూ.. ఎందరో ప్రముఖుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల వారి డ్యాన్స్‌కు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా.. సహా చాలా మంది నెటిజన్లు, ప్రముఖులు అభినందించారు. ఇటీవల పుష్ప సినిమాలోని సామి సామి పాటకు కూడా స్టెప్పులేసి.. ఫాలోవర్లను ఫిదా చేశాడు కిలీ పాల్. ఈ క్రమంలో భారత హైకమిషన్ కిలీ పాల్‌ను సత్కరించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. కిలీ పాల్ లిప్-సింక్ చేస్తూ షేర్ చేస్తున్న వీడియోలు భారతదేశంలో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నాయి అంటూ టాంజానియాలోని భారత హైకమిషన్ బినయ ప్రధాన్ ట్విట్టర్‌లో ఫోటోలను పంచుకున్నారు.
Today had a special visitor at the @IndiainTanzania ; famous Tanzanian artist Kili Paul has won millions of hearts in India for his videos lip-syncing to popular Indian film songs #IndiaTanzania pic.twitter.com/CuTdvqcpsb
— Binaya Pradhan (@binaysrikant76) February 21, 2022
కిలీ పాల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. నటులు ఆయుష్మాన్ ఖురానా, గుల్ పనాగ్, రిచా చద్దా, పలువురు అతనిని గ్రామ్‌లో అనుసరిస్తున్నారు. కిలీ జనాదరణ పొందిన బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లిప్-సింక్ చేసే వీడియోలను, డ్యాన్స్ చేస్తున్న మాత్రమే షేర్ చేస్తాడు. కిలి, నీమా ఇద్దరూ షేర్షా సినిమాలోని రాతన్ లంబియాన్ పాటకు లిప్ సింక్ చేసి.. నెట్టింట వైరల్ అయ్యారు.
కిలీపాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొన్ని వీడియోలను చూడండి..
Also Read: