ఇవాళ్టి తేదీ ప్రత్యేకత గమనించారా.. 22-02-2022 ఈ ట్యూస్ డే – ‘టూ’ స్ డే మరి

ఇవాళ్టి తేదీని గమనించారా.. ఆ ఏముంది అంటారా..? ఈ రోజు తారీఖును ఒకసారి చూస్తే ఆ ప్రత్యేకత ఏమిటో మీకే తెలుస్తుంది మరి. 22-02-2022 చూశారా..

ఇవాళ్టి తేదీ ప్రత్యేకత గమనించారా.. 22-02-2022 ఈ ట్యూస్ డే - 'టూ' స్ డే మరి
Special Date
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 22, 2022 | 11:17 AM

ఇవాళ్టి తేదీని గమనించారా.. ఆ ఏముంది అంటారా..? ఈ రోజు తారీఖును ఒకసారి చూస్తే ఆ ప్రత్యేకత ఏమిటో మీకే తెలుస్తుంది మరి. 22-02-2022 చూశారా.. ఇందులోని అంకెలు ఎటు నుంచి ఎలా చదివినా ఒకేలా వస్తుంది. ఇది చాలా అరుదుగా వచ్చే సంఖ్య. ఇలాంటి సంఖ్యలను పాలిండ్రోమ్, ఆంబిగ్రామ్ అంటారు. ముందు నుంచి వెనుకకు, వెనుక నుంచి ముందుకు చదివినా కూడా ఒకేలా ఉండే అంకెను పాలిండ్రోమ్ అని, తలకిందులుగా చదివినా పై నుంచి కిందకు, కింద నుంచి పైకి ఒకేలా ఉంటే ఆ ప్రత్యేకతను ఆంబిగ్రామ్ అంటారు.

నేటి తేదీలోని మధ్యలో స్లాష్ లు తీసేస్తే.. 22022022 అవుతుంది. పాలిండ్రోమ్, ఆంబిగ్రామ్ బ్రిటిష్ తేదీ ఫార్మాట్ లో పని చేస్తాయి. అంటే dd-mm-yyyy ఫార్మాట్. అదే అమెరికా ఫార్మాట్ లో అయితే mm-dd-yyyy గా రాస్తారు. అమెరికా డేట్ ఫార్మాట్లో చూసుకుంటే ప్రస్తుతం మిలీనియం(జనవరి 1, 2001 నుండి డిసెంబర్ 31, 3000 వరకు) లో మొత్తం 36 పాలిండ్రోమ్ లు వస్తాయి. మొదటిది 10 -02-2001 కాగా, చివరిది 09-22-2290 అవుతుంది. అదే mm-dd-yyyy డేట్ ఫార్మాట్లో అయితే 21వ శతాబ్ధంలో 12 పాలిండ్రోమ్ రోజులు ఉన్నాయి, మొదటిది అక్టోబర్ 2, 2001 (10-02-2001)న కాగా, చివరిది సెప్టెంబర్ 2, 2090 (09-02-2090) న వస్తుంది.

ఆస్ట్రాలజీ ప్రకారం 2 అంకె చంద్రుడిని సూచిస్తుంది. ఈ తేదీ కొందరికి మంచి చేస్తుందని భావిస్తుంటారు. ఇక ఆస్ట్రాలజీ విశ్వసించని వారు కూడా ఈ రోజు గుర్తుండిపోయేలా చేసుకోవాలని అనుకుంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే గర్భవతులు.. పట్టుబట్టి ఇదే రోజున డెలివరీలు అయ్యేలా చూసుకుంటున్నారు. ఈరోజు జన్మించిన శిశువు పుట్టిన తేదీ.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుందని అంటున్నారు.

Also Read

Goutham Reddy: ఎక్స్‌పోలో కాసేపు యాక్టివ్‌, కాసేపు నెమ్మదిగా.. దుబాయ్ టూర్‌లో గౌతమ్‌రెడ్డికి గుండె వార్నింగ్ ఇచ్చిందా..?

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ కొత్త డేట్‌ కాన్ఫామ్‌.! ఎప్పుడంటే..

Bindu Madhavi : బిగ్ బాస్ తో తిరిగి తెలుగులో బిజీ అవ్వాలని చూస్తున్న బిందుమాధవి