Trending News: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై మీమ్స్ ఫెస్ట్.. ట్విట్టర్లో ఆడుకున్న నెటిజన్లు.. వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు

Whatsapp Memes: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ దేశవ్యాప్తంగా 7 గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు చాలా కలత చెందారు. దీంతో ట్విట్టర్‌లో మీమ్‌ల వర్షం కురుస్తోంది.

Trending News: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లపై మీమ్స్ ఫెస్ట్.. ట్విట్టర్లో ఆడుకున్న నెటిజన్లు.. వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు
Whatsapp Down Memes

Updated on: Oct 05, 2021 | 9:08 AM

Whatsapp Down: గతరాత్రి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ దేశవ్యాప్తంగా దాదాపు 7 గంటలపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియా వినియోగదారులు కలత చెందారు. ముఖ్యంగా వాట్సప్ సందేశాలు పంపడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లు పనిచేయడం ఆగిపోయినప్పుడు ప్రజలు ట్విట్టర్‌లో మీమ్స్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ సమయంలో ట్విట్టర్ యూజర్లు మాత్రం చాలా సరదాగా గడిపారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ ఫేస్‌బుక్ యాజమాన్యంలో ఉన్నాయని మనకు తెలిసిందే. అదే సమయంలో ట్విట్టర్ దాని ప్రత్యర్థి కంపెనీకి చెందినది. సోషల్ మీడియాలో వీటి మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ట్విట్టర్‌లో ఈ మూడు ప్లాట్‌ఫారమ్‌లను ఎగతాళి చేస్తూ మీమ్స్ పంచుకున్నారు.

ఇందులో ఓ యూజర్ చేర్ చేసిన మీమ్‌ను చూస్తే కచ్చితంగా నవ్వుకుంటారు. ఇందులో చాలా మంది ప్రజలు కనిపిస్తారు. ఈ వీడియోను షేర్ చేస్తూ, ‘ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్ అయిన తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులందరూ ట్విట్టర్‌కు వస్తున్నారు’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు. మరొక వీడియోలో.. ఒక బాలుడు చాలా ఆనందంతో ఊగుతున్నట్లు, అతనికి కొంచెం దగ్గరలో చాలా మంది ప్రజలు ఆగిపోయి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, ఊయల ఊగుతోన్న బాలుడు ట్విట్టర్ అని, మంటకు దగ్గర నిలబడి ఉన్న వ్యక్తులు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అని రాసుకొచ్చాడు.

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు తమ ప్లాట్‌ఫారమ్‌లను పోస్ట్‌ల ద్వారా అప్‌డేట్ చేయలేకపోతుండగా, వాట్సాప్ యూజర్లు మెసేజ్‌లు పంపడం, స్వీకరించడంలో పలు సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో ఫేస్‌బుక్ ఒక ప్రకటన విడుదల చేసింది. సమస్య త్వరలో పరిష్కరిస్తామంటూ పేర్కొంది. దీంతో ట్విట్టర్లో మీమ్స్ ఫెస్ట్‌కుదారి తీసింది. అనంతరం దాదాపు 7 గంటల తరువాత ఇవన్నీ పనిచేయడం ప్రారంభం అయ్యాయి. దీంతో మరోసారి జుకర్‌బర్గ్ యూజర్లకు సారీ చెబుతూ మరో పోస్ట్‌ను పంచుకున్నాడు. దీనిపై కూడా పలువురు యూజర్లు మీమ్స్‌ను పంచుకున్నారు.

Also Read: Yuvraj Singh: లైగర్‌తో తలపడ్డ యువరాజ్ సింగ్.. టగ్ ఆఫ్‌ వార్‌లో విజేత ఎవరంటే..? వైరలవుతోన్న వీడియో

Viral Video: ఈ సీన్ చూశారా మాస్టారూ..! సింహం టాయిలెట్ యూజ్ చేస్తోంది