ప్రస్తుతం మెట్రో రైళ్లు అత్యంత సౌకర్యవంతమైన రవాణా మార్గాలలో ఒకటిగా అందరూ భావిస్తున్నారు. సందడిగా ఉండే పట్టణ కేంద్రాలను నావిగేట్ చేయడానికి సమర్థవంతమైన మార్గాన్ని అవి అందిస్తాయి. ప్రజలు మెట్రో ద్వారా త్వరగా గమ్య స్థానాన్ని చేరుకుంటారు. అయితే అలాంటి మెట్రో రైళ్లు కొందరు చేసే వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొందరు సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ప్రపోజల్స్ వంటి విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది
ధన్ ధనా ధన్ గోల్ చిత్రంలోని ప్రముఖ బాలీవుడ్ ట్రాక్ ‘బిల్లో రాణి’కి చీరలో ఒక మహిళ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో అందరీ దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోలో ఉన్నది స్వాతి శర్మ అనే మహిళ పూర్తిగా సంగీతంలో మునిగిపోయి, మెట్రోలో చిందు వేసింది. ఆమె చుట్టూ ఉన్న ప్రయాణీకులు ఆ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి ఈమె ఇలా ఉంది అని మరికొందరు అసహనం వ్యక్తం చేశారు. కొందరికి వినోదభరితంగా కనిపిస్తే, మరికొందరికి ఊహించని ప్రదర్శనతో విసుగు చెందారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా ఈ వీడియో ప్రస్తుతం చర్చకు దారి తీసింది.