Sologamy: తనని తానే స్వీయ వివాహం చేసుకుంటానని ప్రకటించి ఇటీవల ఓ యువతి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు (21) స్వీయ వివాహం చేసుకుంటున్నట్లు చేసిన సంచలనంగా మారింది. జూన్ 11న గుడిలో పెళ్లి చేసుకుంటానని.. క్షమా ఏకంగా వివాహ పత్రికలను సైతం రిలీజ్ చేసింది.. దీంతోపాటు గోవాలో తన హనీమూన్ చేసుకుంటానని ప్రకటించింది. అయితే.. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తంచేయడంతో.. యువతి రెండు రోజుల ముందుగానే తనకుతానుగా వివాహం చేసుకుంది. మెహందీ, హల్దీ వేడుకలతో తనకుతానుగా వివాహమాడుకొని.. భారతదేశంలో మొట్టమొదటి ‘సోలోగామి’గా నిలిచింది.
ఈ వివాహం హిందూ ధర్మానికి వ్యతిరేకమని.. బీజేపీ నాయకులు వ్యతిరేకించడంతో పాటు గుడిలో పెళ్లి చేసుకోవడానికి అనుమతించబోమని పూజారి చెప్పడంతో ఎలాంటి వివాదాలు లేకుండా ఉండేందుకు అనుకున్న తేదీ కంటే కొన్ని రోజుల ముందుగానే అట్టహాసంగా పెళ్లి చేసుకున్నట్లు సోలోగామి క్షమా బిందు తెలిపింది. వివాహానంతరం వీడియో సందేశం ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలుపింది. ‘‘ఇప్పటివరకు అందించిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.. మెసేజ్‌లు పంపి అభినందించి, నేను కోరుకున్న దాని కోసం పోరాడే శక్తిని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. తనకు అనేక వర్గాల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ.. కొందరి నుంచి మద్దతు కూడా లభించిందని పేర్కొంది.
వీడియో..
గుజరాత్ వడోదర నివాసి అయిన క్షమా బిందు జూన్ 11న గోత్రిలోని ఆలయంలో తనకు తానుగా (స్వీయ వివాహం) వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొని వార్తల్లో నిలిచింది. క్షమా సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో సీనియర్ రిక్రూట్‌మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులిద్దరూ ఇంజనీర్లు.
“స్వీయ-వివాహం అనేది నీ కోసం ఉండాలనే నిబద్ధత, తన పట్ల షరతులు లేని ప్రేమగా ఆమె పేర్కొంది. ప్రజలు తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటారు. నేను నన్ను ప్రేమిస్తున్నాను.. అందుకే ఈ వివాహం చేసుకుంటున్నాను” అని క్షమా పేర్కొన్న వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారాయి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..