Indian Railway: కిటికీలు, తలుపులు లేని స్పెషల్ రైలు వెనుక అసలు రహస్యం..తెలిస్తే షాక్ అవుతారంతే..!

Indian Railway: మన దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రయాణించే రైళ్లు వివిధ రూపాలు, విభిన్న రకాల రంగులతో కూడిన కోచ్‌లను కలిగి ఉంటాయి. అయితే ప్యాసింజర్ రైలులా కనిపించే, సరుకు రవాణా రైలు వంటి సాధారణ రైలు కంటే చాలా భిన్నమైన రైలు కూడా మనదేశానికి సేవలందిస్తోంది. ఈ రైలు కోచ్‌లకు కిటికీలు, తలుపులు ఏవీ లేవు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఆ డిటెల్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం..

Indian Railway: కిటికీలు, తలుపులు లేని స్పెషల్ రైలు వెనుక అసలు రహస్యం..తెలిస్తే షాక్ అవుతారంతే..!
No Windows, No Doors

Updated on: Jan 22, 2026 | 9:28 AM

మనదేశంలో వివిధ రకాల రైళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్యాసింజర్ రైళ్లు, గూడ్స్ రైళ్లు విడివిడిగా కూడా ఉంటాయి. అలాగే, వివిధ ప్రాంతాలలో ప్రయాణించే రైళ్లు వివిధ రూపాలు, విభిన్న రకాల రంగులతో కూడిన కోచ్‌లను కలిగి ఉంటాయి. అయితే ప్యాసింజర్ రైలులా కనిపించే, సరుకు రవాణా రైలు కంటే చాలా భిన్నమైన రైలు కూడా మనదేశానికి సేవలందిస్తోంది. ఈ రైలు కోచ్‌లకు కిటికీలు, తలుపులు ఏవీ లేవు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? ఆ డిటెల్స్‌ ఏంటో ఇక్కడ చూద్దాం..

ఈ క్లోజ్డ్ కంపార్ట్‌మెంట్ రైలును చూసినప్పుడు చాలా మంది ఈ రైలు దేనికి అని ఆలోచిస్తారు. చాలా మంది ఈ రైలు సైనిక సామగ్రిని లేదా ఏదైనా రహస్య సరుకును తీసుకువెళుతుందని అనుకుంటారు. అయితే, వాస్తవానికి దీని వెనుక కారణం చాలా భిన్నంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఇండియన్‌ రైల్వే భాషలో ఈ రైళ్లను NMG (కొత్త మోడిఫైడ్ గూడ్స్) రైళ్లు అంటారు.

NMG రైలు అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

NMG అంటే న్యూ మోడిఫైడ్ గూడ్స్ రైలు. ఈ మోడల్‌ రైల్వేలు పాత, రద్దు చేయబడిన ప్యాసింజర్ కోచ్‌లను తిరిగి ఉపయోగించుకోవడానికి ఒక తెలివైన మార్గం. జీవిత కాలం ముగిసిపోయి, ప్రయాణీకులకు సురక్షితంగా లేని ప్యాసింజర్ కోచ్‌లను నేరుగా స్క్రాప్ చేయడానికి బదులుగా రైల్వేలు వాటిని ఇలా సరుకు రవాణా కోచ్‌లుగా మారుస్తాయి.

5 నుండి 10 సంవత్సరాల వరకు పునర్వినియోగం

పాత ప్యాసింజర్ కోచ్‌ను NMG కోచ్‌గా మార్చిన తర్వాత ఆ కోచ్‌ను రాబోయే 5 నుండి 10 సంవత్సరాల వరకు సరుకు రవాణాకు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో లోపల ఉన్న అన్ని సీట్లు, ఫ్యాన్‌లు, లైట్లు తొలగించబడతాయి. సామాను నిల్వ చేయడానికి లోపల ఎక్కువ స్థలం ఉండేలా చేస్తారు. అలా ఒక సాధారణ ప్యాసింజర్ కోచ్ పూర్తిగా సరుకు రవాణా కోచ్‌గా మార్చబడుతుంది.

కిటికీలు, తలుపులు ఎందుకు మూసి ఉంటాయి..?

ఈ రైలు కోచ్‌ల కిటికీలు, తలుపులు పూర్తిగా ఇనుప కడ్డీలతో మూసివేయబడి ఉంటాయి. దీని వెనుక ప్రధాన కారణం భద్రత. NMG రైళ్లు ప్రధానంగా కొత్త కార్లు, మినీ ట్రక్కులు, ట్రాక్టర్లు, జీపులు వంటి ఖరీదైన వాహనాలను ఒక నగరం నుండి మరొక నగరానికి రవాణా చేయడానికి ఉపయోగించబడతాయి. కిటికీలు మూసి ఉండటం వలన లోపల ఉన్న వస్తువులు సురక్షితంగా ఉంటాయి. దొంగిలించబడవు. తారుమారు చేయబడవు.

వెనుక పెద్ద తలుపు, లోపల సురక్షితమైన గిడ్డంగి…

NMG కోచ్ వెనుక భాగంలో ఒక పెద్ద, బలమైన తలుపు ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఇది వాహనాలను లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం సులభం చేస్తుంది. అలాగే, కోచ్‌ను మరింత బలంగా ఉంచడానికి అదనంగా ఇనుప కడ్డీలను ఏర్పాటు చేస్తారు. ఇది కోచ్‌ను మొబైల్, సురక్షితమైన గోడౌన్‌గా చేస్తుంది.

రైల్వే ఖర్చు ఆదా సూత్రం..

ఈ విధంగా పాత కోచ్‌లను ఉపయోగించుకుంటూ రైల్వే ఖర్చులను తగ్గిస్తుంది ఆ శాఖ. సరుకు రవాణాను సురక్షితంగా, మరింత సమర్థవంతంగా చేస్తుంది. ఇవన్నీ భారతీయ రైల్వేల సమర్థవంత నిర్వహణ, స్మార్ట్‌ వర్క్‌కు ఉదాహరణగా చెప్పుకొవాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..