ఇండియన్ రైల్వే.. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటు ధరలో అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న కేంద్రప్రభుత్వ రవాణా వ్యవస్థ. మనందరం ఏదో ఒక సమయంలో రైలులో ప్రయాణించిన వాళ్లమే. ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన భారతీయ రైల్వే వివిధ వర్గాల రైళ్లను నడుపుతోంది. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, మెయిల్, DMU, వందేభారత్,గూడ్స్ రైలు..ఇలా అనేక రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తున్నాయి. ప్రయాణంలో రైలు కిటికీలోంచి బయట కనిపించే దృశ్యాలను చూసేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. కానీ, ఒక రైలులో ఎలాంటి కిటికీలు, తలుపులు లేకుండా ప్రయాణిస్తోంది. రైలును చూసిన చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. కిటికీలు, తలుపులు లేని ఈ రైల్లో ప్రయాణం ఎలా ఉంటుంది..? పూర్తిగా సీల్ చేయబడి ఉండే ఈ రైలు దేని కోసం వాడుతున్నారు..?ఇలాంటి రైలును ఎందుకు నడుపుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
పూర్తిగా సీల్ చేసినట్టుగా ఉండే ఈ రైలు NMG రైలు. ఎన్ఎంజీ అంటే న్యూ మాడిఫైడ్ గూడ్స్ అని అర్థం అంటున్నారు రైల్వే అధికారులు. ఈ రైళ్ల ద్వారా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులు రవాణా అవుతాయి. ప్యాసింజర్ రైళ్లను గూడ్స్ రైళ్లుగా మార్చి ఈ రైళ్లను తయారు చేస్తారు. ప్యాసింజర్ కోచ్‌ను NMG కోచ్‌గా మార్చిన తరువాత మరో 5 నుంచి 10 ఏళ్లపాటు వినియోగిస్తారట. ఇలా మాడీఫైడ్ చేసిన రైలును గూడ్స్ కోసం ఉపయోగిస్తుంటారు కాబట్టి.. ఈ రైలుబండికి కిటికీల అవసరం లేదని చెబుతున్నారు.
NMG కోచ్‌లు ఆటో క్యారియర్‌లుగా తయారు చేస్తారు. ఈ రైళ్లలో కార్లు, మినీ ట్రక్కులు, ట్రాక్టర్లను సులభంగా లోడ్, అన్‌లోడ్ చేయవచ్చు. రైలు చివర ఉన్న మొత్తం కోచ్‌లో లగేజీని లోడ్ చేయడానికి మరియు అన్‌లోడ్ చేయడానికి ఒకే ఒక్క డోర్ ఉంటుంది. ఇకపోతే ఈ రైలు వేగం గంటకు 75 కి.మీ.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..