కొంతమంది తాము సంపాదించిన డబ్బులతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటారు. మరికొందరు తాము ఎంత సంపాదించినా దానిని దాచడమే లక్ష్యంగా జీవిస్తారు. అలా ఓ యువకుడు తన జీతాన్ని ఆదా చేయడానికి ఒక ఉపాయాన్ని అనుసరించాడు. ఆ తర్వాత దానిని తాను ఎలా డబ్బులను దాస్తున్నాడో గొప్పగా చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ యువకుడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ యువకుడు వృత్తి రీత్యా డేటా సైంటిస్ట్ . ఇతని వార్షిక ఆదాయం రూ.81 లక్షలు. ఇటీవల ఆ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశాడు. అందులో ఉచిత ఆహారం తింటూ వారానికి తాను డబ్బులను ఎలా ఆదా చేస్తున్నాడో చెప్పాడు. అయితే ఆ సమయంలో తన వీడియో వైరల్‌గా మారితే.. ఉద్యోగం పోతుందనే ఆలోచన కూడా అతనికి ఉండకపోవచ్చు.
ఆ యువకుడు తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు ఆరోపించాడు. మెహుల్ ప్రజాపతి అనే యువకుడు తనకు ఉచిత ఆహారాన్ని అందించే ప్రదేశాలను వెల్లడించాడు. అవి ఛారిటీ ఫుడ్ బ్యాంక్‌లు, కళాశాలు, విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులు, చర్చిలు, NGOలచే నిర్వహించబడుతున్న వాటిల్లో తాను రోజూ ఆహారాన్ని తినేవాడినని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొట్టింది. మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో.. తరువాత సోషల్ సైట్‌లో చర్చ జరిగింది
మెహుల్ వీడియోను @Slatzism హ్యాండిల్‌తో షేర్ చేశారు. TD బ్యాంక్ ఆఫ్ కెనడాలో డేటా సైంటిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నాడు. వార్షిక జీతం 98,000 డాలర్లు (అంటే మన దేశ కరెన్సీలో సుమారుగా 81 లక్షలు). ఐఐటీ ఇతను తన జీతాన్ని ఖర్చు పెట్టి తినడానికి ఇష్టపడక.. ఉచితంగా ఆహారాన్ని అందించే ఛారిటీ ఫుడ్ బ్యాంక్ ల నుంచి ఆహారాన్ని తింటున్నట్లు వీడియోలో పేర్కొన్నారు. అదేదో గొప్ప విషయం అన్నచందంగా గర్వంగా చెబుతున్నాడు.. అయితే ఈ వీడియో పై సర్వత్రా నిరసన వ్యక్తం అయింది. అంతేకాదు అతని కంపెనీ అతని ఉద్యోగం నుంచి తొలగించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ ధ్రువీకరించలేదు.
this guy has a job as a bank data scientist for @TD_Canada, a position that averages $98,000 per year, and proudly uploaded this video showing how much “free food” he gets from charity food banks.
you don’t hate them enough. pic.twitter.com/mUIGQnlYu6
— pagliacci the hated 🌝 (@Slatzism) April 20, 2024
ఛారిటీ బ్యాంక్ నుంచి ఆహారం దొంగిలించే దొంగ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని X వినియోగదారు ట్వీట్ చేశారు. వినియోగదారు TD కెనడా స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసారు. అయితే అందులో ఎక్కడా మెహుల్ పేరు ప్రస్తావించలేదు.
update: the food bank bandit was fired https://t.co/RFLqvVGJb1 pic.twitter.com/CDdrfrmbqI
— pagliacci the hated 🌝 (@Slatzism) April 22, 2024
టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఒక నివేదిక ప్రకారం మెహుల్ కుటుంబం దీనిని ఖండించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఆ కంపెనీలో మెహుల్ ఇంటర్న్‌షిప్ మాత్రమే చేశాడని చెప్పారు. అయితే అతని ఉద్యోగం పోయింది అనే వార్తను టీవీ 9 ధ్రువీకరించలేదు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..