వావ్‌…ఇది మామూలు వాషింగ్ మెషిన్ కాదు.. వెయ్యేళ్లు చెక్కుచెదరని గ్యారెంటీ..!

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఆ వీడియోల్లో కొన్ని జుగాడ్‌ వీడియోలు కూడా ఎక్కువగా చూస్తుంటాం. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి అద్భుతమైన వాషింగ్‌ మెషీన్‌ తయారు చేశాడు. దీనికోసం తక్కువ ఖర్చులో పూర్తయ్యేలా కొన్ని టైల్స్, సిమెంట్, పైపులను ఉపయోగించి సూపర్‌ వాషింగ్ మెషీన్‌ను తయారు చేశాడు. అంతేకాదు..అందులో అతను బట్టలు వాష్‌ చేస్తున్నాడు. కూడా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వావ్‌...ఇది మామూలు వాషింగ్ మెషిన్ కాదు.. వెయ్యేళ్లు చెక్కుచెదరని గ్యారెంటీ..!
Man Made Washing Machine

Updated on: Nov 25, 2025 | 11:45 AM

సోషల్ మీడియాలో అద్భుతమైన వీడియో ఒకటి వేగంగా వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తన తెలివి తేటలను ఉపయోగించి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో వాషింగ్‌ మెషీన్‌ తయారు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ ఖరీదైన డ్రమ్ లేదు, బ్రాండెడ్ మోడల్ లేదు. ఇది స్వచ్ఛమైన భారతీయ ప్రతిభకు నిదర్శనం. ఇది వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఇంట్లోనే టైల్స్, సిమెంట్‌ను ఉపయోగించి వాషింగ్ మెషీన్‌ను నిర్మించాడు. దీనికి ఇంటర్నెట్ వినియోగదారులు పెద్ద సంఖ్యలో స్పందించారు. ఈ వాషింగ్‌ మెషీన్‌ ఖచ్చితంగా వెయ్యి సంవత్సరాల వారంటీ ఉంటుందని చాలా మంది కామెంట్ చేశారు.

టైల్స్ తో వాషింగ్‌ మెషీన్‌ తయారీ కోసం అతడు ఒక వృత్తాకార బేస్ ను తయారు చేశాడు. దానికి అడుగున మోటారును అమర్చి, మధ్యలో వేగంగా తిరిగే బ్లేడ్ లాంటి భాగాన్ని అమర్చినట్లు వీడియో చూపిస్తుంది. దానికే అతను వాటర్‌ కనెక్షన్‌ ఇచ్చాడు. నల్లా తిప్పగానే నీరు మెషీన్‌లోకి వెళ్తుంది. అందులో కావాల్సినంత సబ్బులాంటిది వేసుకుని బట్టలను యంత్రంలో వేసి తిప్పుతున్నాడు. ఆ యంత్రం నిజమైన వాషింగ్ మెషిన్ లాగానే తిరుగుతుంది. బట్టలు నురుగుతో శుభ్రంగా అవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వ్యక్తి చేసిన వినూత్న సాంకేతికతను చూసి వాషింగ్ మెషీన్ తయారీదారులు కూడా తలలు గోక్కుంటున్నారు. ఒకేసారి ఎక్కువ లోడ్‌ను కూడా తట్టుకోగల మోటారును ఈ వాషింగ్ మెషీన్‌లో అమర్చాడు. ఈ యంత్రం ఫుల్‌ బాడీ నీటి నిరోధక, మంట నిరోధకంగా తయారు చేయబడింది. వీడియో చూసిన తర్వాత ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై ప్రశంసలు కురిపించారు. ఇది వెయ్యి సంవత్సరాలు ఉంటుందని కామెంట్ చెప్పారు. raghu_ke_memes అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయబడిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు. చాలామంది దీనిని ఇష్టపడ్డారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా రాశారు..”మోటారు అరిగిపోతుంది, కానీ మిగిలిన నిర్మాణం వెయ్యి సంవత్సరాలు అలాగే ఉంటుంది అని రాశారు. మరొకరు ఇలా రాశారు, చింతించకండి ఇది ఖచ్చితంగా 999+ సంవత్సరాలు ఉంటుంది అని రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us