Viral Video: DJ ఇన్ ది స్కై! 8,000 అడుగుల ఎత్తులో పారాగ్లైడింగ్ చేస్తూ మహిళ సరికొత్త రికార్డ్‌..! ఏం చేసిందంటే..

అందరూ ఏదో ఒక స్టేజ్‌పై తమ DJ పర్ఫామెన్స్‌ చూపిస్తే.. ఈ యువతి మాత్రం తన DJ ట్రిప్స్ కోసం ఓపెన్ స్కైని తన డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చుకుంది. ఆమె తన DJ గేర్‌తో గాలిలో పారాగ్లైడింగ్ చేస్తోంది. ఆమె సంగీతం పర్వతాల నిశ్శబ్దాన్ని చీల్చుతూ ప్రతిధ్వనిస్తోంది. ఆమె రాగాలు గాలిలో ప్రవహిస్తున్నాయి. ఆమె తన బీట్‌కు అనుగుణంగా ఆకాశంలోనే డ్యాన్స్‌ చేస్తోంది.

Viral Video: DJ ఇన్ ది స్కై! 8,000 అడుగుల ఎత్తులో పారాగ్లైడింగ్ చేస్తూ మహిళ సరికొత్త రికార్డ్‌..! ఏం చేసిందంటే..
Dj Paragliding

Updated on: Sep 02, 2025 | 9:59 AM

సాహసం, సంగీతం ఇటువంటి కలయికను మీరు ఇంతకు ముందు ఎప్పుడూ చూసి ఉండరు. ఆకాశం వేదికగా మన భారతదేశ డీజే సంగీతాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లి, ఇంటర్‌నెట్‌ను ఆశ్చర్యపరిచింది ఒక ఇండియన్‌ మహిళ. డీజే ట్రైప్స్ 8,000 అడుగుల ఎత్తులో పారాగ్లైడింగ్ చేస్తూ పూర్తి లైవ్ సెట్‌ను ప్రదర్శిస్తూ  తాను అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సంగీత ప్రియులు, అభిమానులు ఆమె చేసిన పనితో ఉత్కంఠభరితం, స్పూర్తిదాయకం అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. వైరల్‌ వీడియోలో ఆమె తన గేర్‌ను ధరించి నమ్మకంగా డీజే ట్రాక్‌లను గాలిలో వాయిస్తోంది.. ఆమెతో పాటు పారాగ్లైడింగ్  ట్రైనర్ గాలిలోని ప్రతి బీట్‌ను ఆస్వాదిస్తుండటం మనం స్పష్టంగా చూడవచ్చు.

భూమి నుండి వేల అడుగుల ఎత్తులో మ్యూజిక్‌ ప్లే చేయడం అంటే నిజమైన సవాళ్లతో కూడుకున్నది. బలమైన గాలులు, అల్లకల్లోలంగా ఉండే ఆకాశం, క్షణక్షణం మారిపోయే వాతావరణంలో ఆమె ప్రశాంతంగా ఉంటూ గాలిలో సంగీత వాయిద్యాలను సమతుల్యం చేయడం అంత తేలికైన పని కాదు. అయినప్పటికీ ఆమె ఆందోళన లేకుండా డీజే మ్యూజిక్‌ అద్భుతంగా ప్లే చేసింది. అందరూ ఏదో ఒక స్టేజ్‌పై తమ DJ పర్ఫామెన్స్‌ చూపిస్తే.. ఈ యువతి మాత్రం తన DJ ట్రిప్స్ కోసం ఓపెన్ స్కైని తన డ్యాన్స్ ఫ్లోర్‌గా మార్చుకుంది. ఆమె తన DJ గేర్‌తో గాలిలో పారాగ్లైడింగ్ చేస్తోంది. ఆమె సంగీతం పర్వతాల నిశ్శబ్దాన్ని చీల్చుతూ ప్రతిధ్వనిస్తోంది. ఆమె రాగాలు గాలిలో ప్రవహిస్తున్నాయి. ఆమె తన బీట్‌కు అనుగుణంగా ఆకాశంలోనే డ్యాన్స్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి…

ఈ ఉత్కంఠభరితమైన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని బిర్‌లో జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళా పారాగ్లైడింగ్ డీజేగా రికార్డ్‌ సాధించింది. డీజే ట్రిప్స్ తో తన విజయవంతమైన, సాహసోపేతమైన ఫీట్‌తో చూపరులను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోని ఈ వీడియోను @tryps.music ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారి తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటివరకు 12 వేలకు పైగా వీక్షించారు. ఆమె ధైర్యాన్ని ప్రజలందరూ ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..