16 అంతస్థుల రైల్వే స్టేషన్.. దేశంలోనే ఫస్ట్.. దీన్ని ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే..

అహ్మదాబాద్‌లో భారతదేశపు అతిపెద్ద 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణం కానుంది. ఇది కేవలం రైల్వే స్టేషన్ కాదు.. బుల్లెట్ రైలు, మెట్రో, బస్సులను ఒకే చోట కలిపే మల్టీమోడల్ రవాణా కేంద్రం. జపాన్ టెక్నాలజీతో నిర్మించబడే ఈ ప్రాజెక్ట్ ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్‌లో భాగం.

16 అంతస్థుల రైల్వే స్టేషన్.. దేశంలోనే ఫస్ట్.. దీన్ని ప్రత్యేకతలు తెలిస్తే అవాక్కే..
16 Storey Railway Station India

Updated on: Dec 07, 2025 | 9:26 AM

దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజు లక్షల మందిని రైళ్లను తమ గమ్యస్థానాలకు చేరుస్తాయి. తక్కువ రేట్లు, దేశంలో ఎక్కడికైన వెళ్లగలిగే కనెక్టివిటీ వంటివి రైళ్లలో రద్దీకి కారణం. ఇక రైల్వే సేవలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే దేశంలోనే అత్యంత అతిపెద్ద రైల్వే స్టేషన్‌ను నిర్మించడానికి సిద్ధమవుతుంది. దేశంలోని 7,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా నిలవనున్న ఈ 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్‌ కూడా వచ్చింది. ఇది కేవలం సాధారణ రైల్వే స్టేషన్ కాదు. ఇది ఒక 16 అంతస్తుల భవనం. దేశంలో ఉన్న 7,000కు పైగా స్టేషన్లలో ఇది చాలా ప్రత్యేకమైనది. ఈ కొత్త స్టేషన్‌ను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మిస్తున్నారు.

ఎందుకు ప్రత్యేకమైనది?

ఈ 16 అంతస్తుల స్టేషన్ కేవలం రైళ్ల కోసం మాత్రమే కాదు. దీనిని మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా తయారు చేస్తున్నారు. బుల్లెట్ రైలు, సాధారణ రైళ్లు, మెట్రో రైళ్లు, బస్సుల సేవలు అన్నీ ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు ఒకే చోట అనేక రవాణా మార్గాలను ఉపయోగించడం వల్ల సమయం ఆదా అవుతుంది. ప్రయాణం సులభతరం అవుతుంది.

ఏ ప్రాజెక్ట్‌లో భాగం?

ఈ స్టేషన్ ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌లో భాగం. ఈ స్టేషన్‌ను జపాన్ టెక్నాలజీ సహాయంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ బుల్లెట్ రైలు కోసం జపాన్‌కు చెందిన షింకన్‌సెన్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ షింకన్‌సెన్ బుల్లెట్ రైలు టెక్నాలజీని జపాన్‌కు చెందిన ఆల్ఫా-ఎక్స్ అభివృద్ధి చేసింది. ఇది భారత పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించారు. ఇది భారత్ – జపాన్ మధ్య కొనసాగుతున్న హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును మరింత బలోపేతం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

భవనంలో ఏముంటాయి?

16 అంతస్తుల ఈ భవనంలో అధునాతన సౌకర్యాలు ఉంటాయి.

  • పార్కింగ్ స్థలాలు
  • ఆఫీసు స్థలాలు
  • పెద్ద షాపింగ్ మాల్స్ – వాణిజ్య సముదాయాలు
  • అధునాతన విశ్రాంతి గదులు.

ఈ ప్రాజెక్ట్ జూలై 2027 నాటికి పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ హబ్ ద్వారా స్థానిక వ్యాపారం, పర్యాటకం బాగా పెరుగుతాయని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారతదేశం యొక్క రవాణా అవసరాలను తీర్చడమే కాకుండా భవిష్యత్తులో మన రైళ్లను ఇతర దేశాలకు సరఫరా చేయడానికి కూడా మార్గం సుగమం చేస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..