సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతీ రోజూ అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని క్యూట్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి కోవకు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మరి ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండీ.!
సాధారణంగా పాము, కొండచిలువ లాంటి పేర్లను వింటేనే మనలో భయం మొదలవుతుంది. అలాంటిది కొండచిలువను దగ్గర నుంచి చూస్తే.. ఇంకేమైనా ఉందా గుండె ఝల్లుమంటుంది. కానీ ఇప్పుడు చూడబోయే అనకొండ వీడియోను.. మీరు ఒకసారి చూస్తే.. మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటారు. దానికి ఒక రీజన్ ఉండండి. ఇక్కడ మీరు చూసే కొండచిలువ ఇంద్రధనుస్సు మాదిరిగా మెరుస్తూ కనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కాలిఫోర్నియాకు చెందిన రెప్‌టైల్ జూ ఫౌండర్ జే బ్రూవర్ తరచూ వివిధ వర్ణాల్లోని కొండచిలువలను వీడియోలు తీస్తూ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తాడు. తాజాగా నెమలి పించం, బంగారు వర్ణం రంగుల్లో మెరిసిపోతున్న ఓ కొండచిలువ వీడియోను బ్రూవర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ”అనకొండ.. వావ్.! సూపర్” అంటూ కామెంట్స్ చేసి హోరెత్తిస్తున్నారు. కాగా, ఈ వీడియోను ఇప్పటివరకు 48 మిలియన్లకు పైగా వీక్షకులు వీక్షించగా.. 3.3 మిలియన్ల లైకులు సంపాదించింది.
Also Read:
ఇంటి పైకప్పు తుడుస్తుండగా వర్కర్లకు షాక్.. పోలీసుల ఎంట్రీతో వెలుగులోకి విస్తుపోయే విషయాలు.!
ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఈ వారం ఓటీటీలో సందడి చేసే చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. మీరూ ఓ లుక్కేయండి.!