Trending Photo: ఇప్పుడూ ఏది కావాలన్నా ఇంటర్నెట్‌లో దొరికేస్తుంది. వివిధ రకాలు వీడియోలు, ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక టైమ్ పాస్ చేసేందుకు రకరకాల పజిల్స్ సైతం సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. ఇవి నెటిజన్స్‌ను థ్రిల్ చేస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఫోటో పజిల్స్‌పై నెటిజన్స్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫోటోలోని జంతువును కనిపెట్టండి.. లేదా ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయి అనే ఫోటో పజిల్స్ ఈ మధ్య కాలంలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో, కొన్ని ఫోటోలు చూసి ప్రజలు తికమక పడతారు. ఒక్కసారిగా ఆ ఫోటోలను చూసి… అందులో ఉన్నదేంటో తెలియక కన్‌ఫ్యూజ్ అవుతారు. ఎంత తీక్షణంగా వెతికినా.. అందులో దాగి ఉన్నదేంటో సరిగ్గా అర్థం కాదు. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ ఫోటోలో ఉన్నదేంటో తెలియక చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. చాలామంది పర్‌ఫెక్ట్‌గా గెస్ చేయలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నదేంటో మీరైనా గుర్తించారా…? అట్లాంటిక్ సీఈఓ నిక్ థాంప్సన్.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫోటో నెటిజన్లకు ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఫోటోను బట్టి అది మంచుతో కప్పబడిన అటవీ ప్రదేశం అని తెలుస్తుంది. అయితే అక్కడ ఉంది మనిషా లేక కుక్కనా అనేది అర్థం కావడం లేదు. ఈ ఫోటోను మొదట చూసినవారు.. హుడీతో ఉన్న ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్లున్నట్లు భావించారు. అయితే బాగా పరీక్షగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఓ కుక్క కెమెరావైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ఈ ఫోటో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
The amazing picture of the dog, which also looks like a man running into the woods? It’s of a poodle in Alaska named “Bob Marley Sir Pounce A Lot” owned by Terri Babers.
And my favorite thing about the shot is how the trees change size as your perspective shifts. pic.twitter.com/VQjbYOBOea
— nxthompson (@nxthompson) February 6, 2021
Also Read: Viral Video: ఉడుతను సేవ్ చేయడానికి ప్రాణాలకు తెగించిన శునకం..