ముంబై, అక్టోబర్ 24: ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటీ బాంబేలో ఐటెం సాంగ్‌కు విద్యార్ధులు డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ సాంగ్ ‘ మున్నీ బద్నామ్ హుహీ..’ అనే పాటకు బాంబే ఐఐటీ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. ఆ డ్యాన్స్‌కు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. బాంబే ఐఐటీలో చదువుతున్న ఓ విద్యార్ధిని క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి ఆ పాటకు డ్యాన్స్ చేస్తుండగా.. చుట్టూ ఉన్న విద్యార్ధులు కోలాహలంగా చప్పట్లు కొడుతూ వల్గర్‌గా అరవడం వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరికొందరేమో డ్యాన్స్ చేస్తే తప్పేంటీ? అని సమర్ధిస్తున్నారు. మరోవైపు ఐఐటీ బాంబే అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ వీడియో క్లిప్ షేర్ చేయలేదు. ఈ ఘటనపై ఐఐటీ బాంబే ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ సంస్థ అయిన ఐఐటీ బాంబే ఇమేజ్‌కి ఇది సరిపోతుందా అని ఓ యూజర్ ప్రశ్నించారు. విద్యార్ధులు చదువుకోవడానికి IITకి వెళతారు. కానీ ఇక్కడ జరుగుతుంది మాత్రం ఇంకొకటి. ఇది సరైన పద్ధతి కాదు. అసభ్యకరంగా ఇలాంటి డ్యాన్స్ ప్రదర్శనలు IIT బాంబే వంటి విద్యాసంస్థ నుంచి రావడం విలువలకు విరుద్ధంగా ఉన్నాయని పలువురు విమర్శకులు వాదించారు. మరోవైపు పలువురు విద్యార్థులు కాలేజ్ లైఫ్‌ను సరదాగా గడిపితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ డ్యాన్స్ కేవలం సాంస్కృతిక కార్యక్రమంలో భాగమేనని, ఇందులో నాకు అసభ్యంగా ఏమీ కనిపించలేదని ఓ యూజర్ సమర్ధించాడు.
Item dance in IIT Bombay.
Add this college to the list of Amity, Ashoka, and Lovely Professional University. https://t.co/n4THM2gpyX
— ︎ ︎venom (@venom1s) October 18, 2024
Cheap…doesn’t look like that people get education here..looking something else…
— Pihu (@PriyankaSh6677) October 18, 2024
కాగా ఇటీవల IIT బాంబే 2023-24 ప్లేస్‌మెంట్ నివేదిక విడుదలైంది. ఇందులో 25 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ద్వారా ఉద్యోగాలు పొందలేక పోయారు. కొంతమంది విద్యార్థులైతే 4 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక వేతనాలకు ఉద్యోగ ఆఫర్‌లు పొందారు. దీంతో ఆ ఇన్స్‌టిట్యూట్‌పై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
I don’t find anything vulgar
— Nisha (@NishaRo45_) October 18, 2024