ఈ రిటైర్డ్ IFS అధికారి భార్య కూరగాయల లిస్ట్‌ చూశారా..? దిమ్మతిరిగిపోద్ది..!

|

Sep 16, 2024 | 10:47 AM

ఆయనో సీనియర్‌ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. పైగా ఫారెస్ట్‌ రేంజ్‌లో యేళ్ల తరబడి కీలక బాధ్యతలు నిర్వహించి, ఎందరో దొంగలను నేల కరిపించిన ఆఫీసర్‌. కానీ ఎంత పెద్ద ఆఫీసర్‌ అయిన రిటైర్డ్‌ అయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలి. అలా ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేయొచ్చుగా అందేమో ఆయన సతీమణి.. కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు బయల్దేరాడు. కానీ ఇన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన ఎప్పుడూ ఇంటి బాధ్యతలు..

ఈ రిటైర్డ్ IFS అధికారి భార్య కూరగాయల లిస్ట్‌ చూశారా..? దిమ్మతిరిగిపోద్ది..!
IFS officer's wife vegetable buying guide letter
Follow us on

ఆయనో సీనియర్‌ రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి. పైగా ఫారెస్ట్‌ రేంజ్‌లో యేళ్ల తరబడి కీలక బాధ్యతలు నిర్వహించి, ఎందరో దొంగలను నేల కరిపించిన ఆఫీసర్‌. కానీ ఎంత పెద్ద ఆఫీసర్‌ అయిన రిటైర్డ్‌ అయిన తర్వాత ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాలి. అలా ఖాళీగా ఉండే బదులు ఏదో ఒక పని చేయొచ్చుగా అందేమో ఆయన సతీమణి.. కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు బయల్దేరాడు. కానీ ఇన్నాళ్లు ఉద్యోగం చేసిన ఆయన ఎప్పుడూ ఇంటి బాధ్యతలు తీసుకోలేదో.. ఏమో.. ఉన్నట్లుండి కూరగాయల మార్కెట్‌కు పంపిస్తే ఇక ఆ రోజు వంట చేసినట్లే! అని సందేహం వచ్చినట్లుంది ఆయన భార్యకు. ఓ కాగితం తీసుకుని కొనదగిన కూరగాయల గుణగణాలను రాసి ఇచ్చింది. ఇక అది చూసిన సదరు అధికారి బిక్క మొహం వేశారు. కనీసం ఈ పాటి తెలివి తేటలు కూడా నాకు లేవా? అని తెగ ఆలోచించేస్తున్నారు. ఆయన భార్య చేతిరాతతో ఉన్న కూరగాయల లిస్ట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట సందడి నెలకొంది. చూసిన వారంతా తెగ నవ్వేస్తున్నారు. మార్కెట్‌కు మొదటిసారి వెళ్తున్న తన భర్తకు ఏమేం కొనాలో, ఎలాంటివి కొనాలో పరిమాణం, ఆకారం, రంగు.. ఇలా తదితర అంశాలను సూచించే గైడ్‌ ఇది.. ! విషయంలోకెళ్దాం..

రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ (IFS) అధికారి మోహన్ పర్గైన్ ఇటీవల విధుల నుంచి రిటైర్‌మెంట్ తీసుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు బయల్దేరగా.. ఆయన భార్య ఓ చీటీ చేతిలో పెట్టింది. మామూలుగా ఇంటికి కావాల్సిన వస్తువులను ఒక చిన్న చీటీపై రాసి ఎవరైనా ఇస్తారు. దీనిపై అంత చర్చ అవసరం లేదు. కానీ సదరు అధికారి భార్య ఇచ్చిన చీటిలో మాత్రం మిరపకాయలు, ఆలుగడ్డ, పాలకూర, బెండకాయ, ఉల్లి, టొమాటో, పాలు.. వంటి వాటి ఆకారం, రంగు, సైజు వంటి వివరాలతోసహా పేపర్‌ రాసి, ఆ పక్కనే వాటి బొమ్మలు కూడా గీసి.. బలే గమ్మత్తుగా చీటీ రాసింది. తెలియని ప్రదేశానికి వెళ్లేటప్పుడు రూట్ మ్యాప్‌ ఎంత అవసరమో తొలిసారి మార్కెట్కు వెళ్లేప్పుడు ఇలాంటి ఓ గైడ్‌ అవసరం అని ఆవిడ భావించి ఉంటుంది. దీంతో ‘మార్కెట్‌కు వెళ్తున్నప్పుడు నా భార్య ఇచ్చిన చీటీ ఇది. ఇదొక గైడ్‌లా ఉపయోగపడుతుందని నాతో చెప్పిందని’ మాజీ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌(PCCF) మోహన్‌ పర్గేయన్‌ ఈ ఫొటోను తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

టమాటాలు పసుపు, ఎరుపు రంగుల్లో మాత్రమే ఉండాలి. రంధ్రాలు ఉండొద్దు. మెత్తగా ఉండకూడదు. ఉల్లిపాయలు చిన్న సైజులో గుండ్రంగా ఉండాలి. మొలకలు ఉండకూడదు. బంగాళాదుంపలు పెద్దగా ఉండకూడదు. పాలకూర, బచ్చలికూర, మెంతికూర ఆకులు పచ్చగా పొడవుగా ఉండాలి. రంధ్రాల్లేకుండా ఉండాలి. మిర్చీ పొట్టిగా ఉండాలి. వీలైతే ఫ్రీగా అడగండి. ఇవన్నీ ఫలానా చోట నుంచి తీసుకురండి’ ఇలా స్పష్టమైన ఆదేశాలతో రాసి ఉన్న ఈ చీటీని చూసిన నెటిజన్లు ఆమె కొనుగోలు నైపుణ్యాలను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ యూజరైతే ‘సర్‌.. మీ భార్య ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో పని చేశారా?’ అనే సందేహం వెలిబుచ్చారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాక ఎవరికైనా ఇలాంటి సందేహాలే వస్తాయి మరి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.