Watch: ఓరి నాయనో ఐస్‌క్రీమ్ పకోడీ అట.. ఏందిరయ్యా ఈ వంటకాలు..!

|

Aug 21, 2024 | 10:10 PM

వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని చాలా వింతగా పరిగణిస్తున్నారు. మరికొందరు మాస్టర్‌చెఫ్‌లో చూపించడానికి అర్హమైనదిగా భావిస్తారు. అయితే, ఇది ఎలా తింటార్రా బాబు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వీడియో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు..

Watch: ఓరి నాయనో ఐస్‌క్రీమ్ పకోడీ అట.. ఏందిరయ్యా ఈ వంటకాలు..!
Ice Cream Pakoda
Follow us on

సోషల్ మీడియాలో విచిత్ర వంటకాలకు సంబంధించి అనేక వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. సంప్రదాయ వంటకాలను విభిన్న రీతిలో తయారు చేస్తూ వీడియోలు, రీల్స్‌ చేస్తున్నారు చాలా మంది. వ్యూస్‌ పిచ్చితో చేసే ఇలాంటి వీడియోల వల్ల ఇంటర్ నెట్‌ ప్లాట్‌పామ్‌ వేదికగా ప్రతిరోజు ఎన్నో రకాల వంటకాలు పుట్టుకొస్తున్నాయి. మహిళా మణులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్నడూ ఎవరూ చేయని కాంబినేషన్‌లో వంటలు వండుతూ అందరి ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ప్రయోగాల పేరుతో ఐకానిక్‌ వంటకాలతో ఆడుకుంటున్నారు మరికొందరు. ప్రస్తుతం ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియో కూడా అలాంటిదే.

వైరల్‌ వీడియోలో ఒక వ్యక్తి ఐస్ క్రీం పకోడాలు తయారు చేస్తున్నాడు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. చాకోబార్ ఐస్‌క్రీమ్‌ను శెనగపిండి మిశ్రమంలో ముంచి బజ్జీల్లా వేయిస్తున్నాడు. వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని చాలా వింతగా పరిగణిస్తున్నారు. మరికొందరు మాస్టర్‌చెఫ్‌లో చూపించడానికి అర్హమైనదిగా భావిస్తారు. అయితే, ఇది ఎలా తింటార్రా బాబు అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. వీడియో చూస్తే మీరు కూడా షాక్‌ అవుతారు..

ఇవి కూడా చదవండి

ఈ వీడియో చూడండి..

ఈ వీడియో @desimojito హ్యాండిల్‌తో Xలో షేర్‌ చేయబడింది. ఇది ఇప్పటివరకు దాదాపు 60 లక్షలకు వీక్షించారు. చాలా మంది వినియోగదారులు వీడియోపై స్పందించారు. ఓహ్ గాడ్…ఐస్ క్రీం కూడా డీప్ ఫ్రై చేస్తున్నారంటూ ఒకరు రాయగా, మరొకరు దీనిపై స్పందిస్తూ.. ఓరీ దేవుడా ఇలాంటి వాళ్ల నుంచి రక్షించేందుకు నువ్వు దిగిరావాల్సిందే..అంటూ పేర్కొన్నారు. ఇలాంటి వింత ఫుడ్ కాంబినేషన్స్‌తో పకోడీలు చేయడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా పార్లే జి బిస్కెట్, ఓరియో, గులాబ్ జామున్‌ పకోడా లాంటి ట్రెండ్స్ సోషల్ మీడియాలో కనిపించాయంటూ మరికొందరు వ్యాఖ్యనించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..