Viral Video: ఓ బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టిన వీడియో వైరల్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే..

|

Jul 19, 2024 | 4:32 PM

వీడియో మరికాస్త ముందుకు వెళితే.. ఇలాగే ఆటో ట్రాలీతో అటాచ్‌ చేసి కట్టిన వీల్స్‌ప్లాట్‌ఫామ్‌పై మరో ఏనుగు అదే రీతిలో నిలబడి ఉంది. ఏనుగులు రెండూ నిశ్చలంగా ఉన్నాయి. ఈ వీడియో వాటి వెనకాలే ప్రయాణిస్తున్న కారులోంచి తీసినట్టుగా తెలిసింది. దీనికి క్యాప్షన్‌లో,ఇది అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది అని రాసి ఉంది. ఈ క్యాప్షన్ నుండి ఈ మొత్తం వీడియో సారాంశం మీకు అర్థం కాకపోతే, మీరు క్లిప్‌ను కొంచెం జాగ్రత్తగా చూడాలి.

Viral Video: ఓ బుల్లి ఆటో ట్రాలీలో భారీ గజరాజు..! ఐఏఎస్‌ అధికారినే కంగారుపెట్టిన వీడియో వైరల్‌.. ఇంతకీ ఏం జరిగిందంటే..
Robotic Elephants
Follow us on

ఏనుగులు కాలినడకన వెళ్లడం మీరు ఇప్పటి వరకు చూసి ఉంటారు. అయితే, ఏనుగులు వాహనాల్లో ప్రయాణిస్తున్నాయంటే మీ కళ్లను మీరు నమ్ముతారా? ఒక ఫన్నీ క్లిప్ ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది. ఇందులో రెండు ఏనుగులు నడిరోడ్డుపై చక్రాలతో ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి ప్రయాణిస్తున్నాయి.. ఈ క్లిప్ సోషల్ మీడియాలో కనిపించిన వెంటనే ప్రజలు దీన్ని విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. ఇది చూసి నెటిజనం ఆశ్చర్యపోతున్నారు. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఇందులో లోడింగ్ వాహనం వెనుక, వీల్స్‌ కలిగిన ప్లాట్‌ఫారమ్‌ వంటిది ఏర్పాటు చేశారు. ఏనుగు దానిపై నిలబడి ఉంది. వీడియో మరికాస్త ముందుకు వెళితే.. ఇలాగే ఆటో ట్రాలీతో అటాచ్‌ చేసి కట్టిన వీల్స్‌ప్లాట్‌ఫామ్‌పై మరో ఏనుగు అదే రీతిలో నిలబడి ఉంది. ఏనుగులు రెండూ నిశ్చలంగా ఉన్నాయి. ఈ వీడియో వాటి వెనకాలే ప్రయాణిస్తున్న కారులోంచి తీసినట్టుగా తెలిసింది. దీనికి క్యాప్షన్‌లో,ఇది అర్థం చేసుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది అని రాసి ఉంది. ఈ క్యాప్షన్ నుండి ఈ మొత్తం వీడియో సారాంశం మీకు అర్థం కాకపోతే, మీరు క్లిప్‌ను కొంచెం జాగ్రత్తగా చూడాలి.

ఇవి రోబోటిక్ ఏనుగులు.. ఇవి సాంకేతికత, అద్భుతమైన పనితనంతో తయారు చేయబడ్డాయి. వాటి చర్మం, దంతాలు, కళ్ల రంగు, ఆకృతి నిజమైన ఏనుగు మాదిరిగానే తయారు చేశారు. తద్వారా మొదటిసారి చూసినప్పుడు అవి నిజమైన ఏనుగులుగా కనిపిస్తాయి. కేరళ, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో పూజలు, ఇతర సాంస్కృతిక ఉత్సవాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ క్లిప్‌కి కొన్ని గంటల్లోనే 29.5 వేల వ్యూస్‌ వచ్చి చేరాయి. కాకపోతే, ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడిది వంటి సమాచారం వెల్లడి కాలేదు.

ఇవి కూడా చదవండి

కానీ, ఇలాంటి అద్భుతమైన విగ్రహాలను తయారు చేసిన కళాకారులను మాత్రం ప్రజలు కొనియాడుతున్నారు. ఒక యూజర్ కామెంట్‌లో చాలా బాగుంది అని రాశారు. అసలు ఏనుగులను అడవిలోనే ఉండనివ్వండి. రోబోట్ ఏనుగులు ఎంతటి కష్టతరమైన పనిని కూడా ఈజీగా చేయగలవు అని పేర్కొన్నారు. మరొకరు ఇలా వ్రాశారు, నేను మొదటిసారి చూసినప్పుడు షాక్ అయ్యాను. చాలా మంది వాటిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవి నిజమైన ఏనుగులు కాదని, వాటి విగ్రహాలని నమ్మలేకపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..