ఒక్క క్షణంలో ఏమైనా జరగొచ్చు.. ఈ వీడియోనే సాక్ష్యం

| Edited By:

Oct 21, 2019 | 6:43 AM

ఒక్క క్షణం.. ఆ ఒక్క క్షణంలోనే ఏమైనా జరగొచ్చు. ప్రాణం పోవచ్చు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అనుకోకుండా గాయపడొచ్చు. అలాంటి సంఘటనే ఓ అడవిలో హైనా(దుమ్ములగొండి), చిరుతపులి మధ్య జరిగింది. తన ప్రాణాలను కాపాడుకోవాలని భావించిన ఓ చిరుత మరే ఆలోచన లేకుండా దగ్గరున్న చెట్టును ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఎవరు తీశారో..? ఎక్కడ తీశారో..? తెలీదు కానీ.. భారత అటవీశాఖ అధికారి సుశాంత […]

ఒక్క క్షణంలో ఏమైనా జరగొచ్చు.. ఈ వీడియోనే సాక్ష్యం
Follow us on

ఒక్క క్షణం.. ఆ ఒక్క క్షణంలోనే ఏమైనా జరగొచ్చు. ప్రాణం పోవచ్చు. పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అనుకోకుండా గాయపడొచ్చు. అలాంటి సంఘటనే ఓ అడవిలో హైనా(దుమ్ములగొండి), చిరుతపులి మధ్య జరిగింది. తన ప్రాణాలను కాపాడుకోవాలని భావించిన ఓ చిరుత మరే ఆలోచన లేకుండా దగ్గరున్న చెట్టును ఎక్కేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ఎవరు తీశారో..? ఎక్కడ తీశారో..? తెలీదు కానీ.. భారత అటవీశాఖ అధికారి సుశాంత నంద తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ వీడియాలో హైనా, చిరుతపులిలు ఎదురెదురు పడ్డాయి. ఆ సమయంలో హైనా చిరుత పులిపై దాడి చేయాలని భావించగా.. వెంటనే అప్రమత్తమైన చిరుత.. తక్కువ సెకన్లలో పక్కనే ఉన్న చెట్టు మీదకు ఎక్కేసింది. దీనిపై సుశాంత.. ‘‘కొన్ని సార్లు చావు, బతుకుల మధ్య ఖాళీ ఓ జంప్ అవ్వొచ్చు. సాధారణంగా సింహాలు, హైనాలు మాత్రమే మధ్యవయసులో ఉన్న చిరుతపులిలపై మెరుపువేగంతో దాడి చేస్తుంటాయి. అయితే హైనాతో కయ్యానికి కాలు దువ్వి.. తన జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోకూడదని భావించిన ఆ చిరుత తెలివిగా తప్పించుకుంది’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియో వైరల్‌గా మారగా.. నెటిజన్లు, చిరుత‌ సమయస్ఫూర్తిని మెచ్చుకుంటున్నారు.