టిక్ టాక్ వీడియోలతో ఇబ్బంది పెడుతున్న భార్య..! షాకింగ్ నిర్ణయం తీసుకున్న భర్త..
Husband Divorces Wife: సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలని చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. కొందరు ఫన్నీ వీడియోలు చేస్తారు. మరికొందరు వింత చర్యలు,

Husband Divorces Wife: సోషల్ మీడియాలో ట్రెండ్ కావాలని చాలామంది వివిధ రకాలుగా ప్రయత్నిస్తారు. కొందరు ఫన్నీ వీడియోలు చేస్తారు. మరికొందరు వింత చర్యలు, చిలిపి చేష్టలను అప్‌లోడ్ చేస్తారు. మొత్తానికైతే నెటిజన్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. అయితే UKలో కూడా ఓ మహిళ ఇలాగే చేసింది. దీంతో ఆమె భర్త విడాకుల వరకు వెళ్లాడు. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఫేమస్ కావడానికి తన భార్య.. పిల్లలను హింసిస్తోందని ఆరోపించాడు. ది మిర్రర్ నివేదిక ప్రకారం.. ఆ మహిళ భర్త ఆన్‌లైన్ చర్చా వేదికగా ఈ విషయాలను వెల్లడించాడు.
తన భార్య ప్రతిరోజూ టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ప్రయత్నించేదన్నాడు. కానీ ఇటీవల ఆమె తన హద్దులను దాటి ప్రవర్తించడం తాను గమనించినట్లు చెప్పాడు. ఫన్నీ కంటెంట్ పేరిట ఆమె తన ఆరేళ్ల కూతురు, ఏడాది వయసున్న కుమారుడితో అసభ్యకరమైన వీడియోలు చేస్తుందని ఆరోపించాడు. టిక్ టాక్ వీడియో చేసే క్రమంలో ఒకసారి తన కూతురిని బాగా హింసించిందని, ఆమె బిగ్గరగా ఏడవడం లైవ్‌లో చూశానని చెప్పాడు. గత కొన్ని వారాలుగా తన ఇంట్లో జరుగుతున్నది ఇదేనని బాధపడ్డాడు.
అంతేకాదు తన భార్యకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా ఆమె ఒప్పుకోవడంలేదని వీటిని మానుకోవడం లేదని ఆరోపించాడు. ఇప్పుడు తన కూతురు తల్లితో గదిలో పడుకోవడానికి భయపడే స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తన భార్యకు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అంతేకాదు ఆ మహిళ తన ఏడాది వయసున్న కుమారుడిని కూడా విడిచిపెట్టలేదన్నాడు. అతడితో కూడా ఒక వీడియో చేసిందని, దీంతో పిల్లవాడు చాలా భయపడిపోయాడని పేర్కొన్నాడు. అయినా కూడా పిల్లాడని పట్టించుకోకుండా వీడియో ఎడిట్ చేయడంలో బిజీగా గడిపిందని భర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు.