చెట్టుకింద దయ్యం.. నాకేం భయం అన్న కథ విన్నాం కదా.. ఇది కూడా అలాంటిదే. కాకపోతే విషజాతికి చెందిన ఇవి. అడవుల్లో ఉండాల్సినవి.. ఈ మధ్య జనావాసాల్లో చేరి హడలెత్తిస్తున్నాయి. కాలి కిందకు వచ్చి చేరడమో.. లేదంటే ఇంట్లోకి రావడమో వాహనాల్లో మనతో పాటు జర్నీ చేయడమో చేస్తూ.. ఒక్కసారిగా జడిపిస్తున్నాయి.
ఇదిగో ఇక్కడ చూశారా.. ఓ బైకును అంతగా పరీక్షించి ఎందుకు చూస్తున్నారు.. ఏముంది అందులో అనే కదా మీ డౌట్. ఆగండాగండి.. అల్లంత దూరాన కొందరు.. ఆ బైక్ దగ్గర ఇద్దరు అందులో వెతుకుతున్నది ఇదిగో ఈ కొండచిలువ కోసమే. చూశారు కదా.. వామ్మో చూస్తేనే వణుకుపుట్టినంత పనికాలే. పాములు ఈ మధ్య అడవులు వీడి.. ఇలా జనావాసాల్లోకి వస్తున్నాయి. అలా మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా కోర్టులో పార్కింగ్ చేసిన టూవీలర్‌లో చేరింది ఆ పాము. ఆ బైకును కానిస్టేబుల్ తీసే యత్నం చేస్తుండగా.. పాము కనిపించింది. అది కూడా ముందు హెడ్‌లైట్‌లో ఉండడాన్ని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇచ్చి.. ఇలా దాన్ని సురక్షితంగా బయటకు తీసేలా చేశారు. నాగుపాము.. చాలా విషపూరితమైన పాములు ఇలా బాహాటంగా జనావాసాల్లోకి రావడంపై జనం కూడా జంకుతున్నారు.
ఇవి కూడా చదవండి:
उज्जैन–जब पुलिसकर्मी की बाइक पर सवार हुए नागराज,वन विभाग के कर्मचारी ने किया रेस्क्यू,वन विभाग कर्मचारी के मुताबिक रेस्क्यू किया गया साँप कोबरा प्रजाति का था, pic.twitter.com/gx3oJn50MK
— vikas singh Chauhan (@vikassingh218) March 8, 2022