చేపలు పడుతుండగా కనిపించిన నల్లటి ఆకారం.. ఒక్కసారిగా ఒడ్డుకు దూసుకొచ్చింది.. కట్ చేస్తే.!

|

May 11, 2024 | 3:44 PM

ప్రాంతమేదైనా.. నది ఏదైనా.. ఈ మధ్యకాలంలో కొందరు చేపలు పడుతుండగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వలలో చేపలకు బదులుగా చిత్రవిచిత్రమైన జీవులు పడటం, అప్పుడప్పుడూ పాములు, కొండచిలువలు, లేదా అరుదైన పెద్ద చేపలు.. ఇలా ఒకటేమిటీ చెప్పుకుంటూపోతే..

చేపలు పడుతుండగా కనిపించిన నల్లటి ఆకారం.. ఒక్కసారిగా ఒడ్డుకు దూసుకొచ్చింది.. కట్ చేస్తే.!
Viral Video
Follow us on

ప్రాంతమేదైనా.. నది ఏదైనా.. ఈ మధ్యకాలంలో కొందరు చేపలు పడుతుండగా అనూహ్య సంఘటనలు చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. వలలో చేపలకు బదులుగా చిత్రవిచిత్రమైన జీవులు పడటం, అప్పుడప్పుడూ పాములు, కొండచిలువలు, లేదా అరుదైన పెద్ద చేపలు.. ఇలా ఒకటేమిటీ చెప్పుకుంటూపోతే చాలానే ఉన్నాయి. సరిగ్గా ఈ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తనకు దగ్గరలోని నదికి వెళ్లి.. చేపలు పడుతుండగా.. ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వివరాలలోకెళ్తే.. ఓ వ్యక్తి నది వద్ద తాపీగా కూర్చుని నీటిలోకి గాలం వేశాడు. కొద్దిసేపు వేచి చూడగా.. ఆ గాలానికి ఓ చేప చిక్కింది. భలే.. భలే.. నా గాలానికి చేప చిక్కింది అని దాన్ని తీయాలని ప్రయత్నించగా.. నీటిలో ఓ నల్లటి ఆకారం.. తనవైపుగా వస్తున్నట్టు గమనించాడు. అది ఒడ్డుకు ఒక్కసారిగా దూసుకొస్తోంది. తీరా అదేంటని చూస్తే.. భారీ సైజ్ మొసలి. ఇంకేముంది ఒడ్డుకు వచ్చిన ఆ మొసలిని చూడగానే.. మనోడు పరుగులు పెట్టాడు. చేప, గాలం అన్ని కూడా అక్కడే వదిలేసి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులుపెట్టాడు. ‘నా ఎరనే నువ్వు లాక్కుని వెళ్తావా’ అని ఆ మొసలి అతడిని కొంతదూరం వెంబడించింది.

ఇది చదవండి: ఇంటికి రిపేర్ చేస్తుండగా కార్పెట్ కింద ఏదో ఉందని అనుమానం.. ఏంటా అని చూడగా.!

కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా.. అది కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘తస్సాదియ్యా ఈ ట్విస్ట్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని ఒకరు కామెంట్ చేస్తే’.. ‘తన ఆహారాన్ని లాక్కుంటే.. కోపం రాదా’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: దమ్మున్న పజిల్.! మీ వైపే చూస్తోన్న చిరుతను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే తోపు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..