Viral Video: ఈ వీడియో చూశారంటే మట్టితో వినాయకుడిని సింపుల్‌గా చేయవచ్చు..

|

Aug 26, 2024 | 6:15 PM

వినాయక చవితి వచ్చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి చేస్తారు. దేశ వ్యాప్తంగా ఎలాంటి బేధాలూ లేకుండా గణేష్ పండగను తయారు చేసుకుంటారు. ఎంతో ఆర్భాటంగా ఈ పండుగ చేస్తారు. ఊరు వాడ కూడా పందిళ్లు వేసి.. నవ రాత్రులు వినాయకుడిని పూజిస్తారు. అయితే ఎక్కువగా గణేష్ విగ్రహాలను మట్టితో తయారు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మట్టి విగ్రహాలను కూడా చాలా వరకు ఉచితంగానే..

Viral Video: ఈ వీడియో చూశారంటే మట్టితో వినాయకుడిని సింపుల్‌గా చేయవచ్చు..
Viral Video
Follow us on

వినాయక చవితి వచ్చేస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి చేస్తారు. దేశ వ్యాప్తంగా ఎలాంటి బేధాలూ లేకుండా గణేష్ పండగను తయారు చేసుకుంటారు. ఎంతో ఆర్భాటంగా ఈ పండుగ చేస్తారు. ఊరు వాడ కూడా పందిళ్లు వేసి.. నవ రాత్రులు వినాయకుడిని పూజిస్తారు. అయితే ఎక్కువగా గణేష్ విగ్రహాలను మట్టితో తయారు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మట్టి విగ్రహాలను కూడా చాలా వరకు ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. కానా కొంత మందికి ఈ విగ్రహాలు అందడం లేదు. దీంతో కొనుగోలు చేస్తున్నారు. అలా కొనాల్సిన పని లేకుండా మట్టి ఉందంటే మనం ఎంతో ఈజీగా ఈ విగ్రహాలను తయారు చేసుకోవచ్చు. మరి వినాయక విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూసేయండి.

ముందుగా మట్టిని తీసుకుని అందులో నీళ్లు వేసి.. చాలా స్మూత్‌గా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొన్ని పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. ముందుగా చిన్న ముద్దతో.. వీడియోలో చూపించినట్టు చేయాలి. ఆ తర్వాత మరో కాస్త పెద్ద ముద్దను తీసుకుని రౌండ్‌గా చేసుకుని పెట్టుకోవాలి. ఆ పైన గుండ్రంగా ఉన్న మరో చిన్న బాల్ ఉంచాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలి. ఇప్పుడు మరో కొద్దిగా మట్టి తీసుకుని పొడ్డుగా చేసుకుని చేతులను జాయింట్ చేయాలి. ఇక ఫైనల్‌గా తల, చెవులు, తొండం పెట్టేస్తే.. మట్టి వినాయక విగ్రహం తయారు అయినట్టే. చూశారుగా సింపుల్‌గా ఎంతో ఫాస్ట్‌గా మట్టి విగ్రహం చేసుకోవచ్చు.

ఈ సారి వినాయక చవితికి ఇలా మట్టితో స్వయంగా మీరే వినాయకుడిని తయారు చేసుకుని పూజించండి. ఎంతో ఆనందంగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చిన్న డెకరేషన్ చేస్తే.. వినాయకుడు ఎంతో అందంగా కనిపిస్తాడు. పూజ అనంతరం మట్టిలో కాస్త నీళ్లు పోసి నిమజ్జనం చేయవచ్చు. ఈ మట్టిని మొక్కలకు ఉపయోగించవచ్చు. ఇంకెందుకు లేట్ ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..