Viral‌ Video : గాల్లో వేలాడిన గుర్రం..! మనిషి చేసే తప్పులు జంతువులకు ముప్పుగా పరిణమించాయి.. వైరల్‌ వీడియో..

Viral‌ Video : సోషల్ మీడియా ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అందరి అభిప్రాయాలు కనిపిస్తాయి. కొత్త

Viral‌ Video : గాల్లో వేలాడిన గుర్రం..! మనిషి చేసే తప్పులు జంతువులకు ముప్పుగా పరిణమించాయి.. వైరల్‌ వీడియో..
Horse Hanging
Follow us
uppula Raju

| Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2021 | 12:47 PM

Viral‌ Video : సోషల్ మీడియా ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ అందరి అభిప్రాయాలు కనిపిస్తాయి. కొత్త సంఘటన ఏదైనా అది సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తుంది. ఈ రోజుల్లో చాలా ప్రత్యేకమైన వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతోంది. వాస్తవానికి మనం ఇక్కడ మాట్లాడుతున్నది గుర్రం వీడియో గురించి. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ వీడియోలో గుర్రపు బగ్గీ ఎక్కువ బస్తాలతో లోడ్ చేయబడిందని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే గుర్రం రహదారిపై మధ్యలో గాలిలోకి లేస్తుంది. బగ్గీ వెనుక భాగం బరువు కారణంగా గుర్రం గాల్లో తేలియాడుతుంది. ఈ దృశ్యాన్ని చూసి చుట్టుపక్కల ప్రజలు గుర్రాన్ని కాపాడటానికి బగ్గీ నుంచి సరుకులను దించుతారు.

మొదట ప్రజలు గుర్రాన్ని మామూలుగా దించడానికి ప్రయత్నిస్తారు. కానీ బగ్గీలో ఉన్న వస్తువులను తగ్గించినప్పుడు మాత్రమే గుర్రాన్ని దించగలమని వారు అర్థం చేసుకుంటారు. ఈ వీడియో చూసిన తరువాత బగ్గీలో లోడ్ చేసిన బస్తాల బరువు గుర్రపు బరువుకు మించి ఉందని అర్థమవుతోంది. కనుక మీరు మూగజీవాలపై జాలి చూపాలి. మానవుల తప్పుల వల్ల చాలా సార్లు జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. తర్వాత పశ్చాత్తాపం చెందడం ద్వారా ఏమీ ఒరిగేది లేదు.

ఈ వీడియోను మే 26 న రమేష్ కుమార్ పేరుతో ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఈ స్టోరీ రాసే సమయం వరకు ఈ వీడియో ఒక మిలియన్ కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. 3000 మందికి పైగా దీనిని షేర్ చేశారు. ఈ వీడియో కింద వెయ్యికి పైగా కామెంట్స్ నమోదు చేయబడ్డాయి. దీనితో పాటు ఈ వీడియో ఇప్పటివరకు 40 వేలకు పైగా లైక్ చేయబడింది.

After Corona Vaccination : కరోనా టీకా వేసుకున్నాక శరీరం అయస్కాంతంగా మారుతుందా..! అస్సాంలో ఓ వ్యక్తి బాడీ చెంచాలు, నాణేలను ఆకర్షిస్తుంది..

Nayanthara: నయనతార ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్.. ఆ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్..! విఘ్నేష్ శివన్ కీ రోల్

Cooking Tips:కూరలో ఉప్పు,కారం ఎక్కువైందా.. తోడులేకుండా పెరుగు రెడీ కావాలా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే సరి